సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్‌లో సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. 83.58 శాతం ఫలితాలతో కళాశాల రికార్డు స్థాయి ఉత్తీర్ణతను సాధించింది. తెలుగుమీడియం గ్రూప్‌ల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఎంపీసీ టీఎంలో నూరుశాతం ఫలితాలు పొందింది. బైపీసీలో 58.33 శాతం, సీఈసీలో 80శాతం, హెచ్‌ఈసీలో 92 శాతం ఫలితాలు సాధించింది. ఎంపీసీ విభాగంలో తిరువాయిపాటి కల్పనాదేవి 869 మార్కులు, బైపీసీలో ఎం.వసంద్రిక 731, సీఈసీలో దారావతు సౌజన్య 761, హెచ్‌ఈసీలో తాటి కుమారి 818 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి తెలిపారు.
ఏటేటా పైపైకి..
అధ్యాపకుల అంకితభావం, విద్యార్థుల పట్టుదలతో కళాశాల కీర్తి ఏటేటా పైపైకి పాకుతోంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తోంది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటేటా వసతులను మెరుగుపర్చుకుంటూ.. అదే రీతిలో ఫలితాలను సాధిస్తోంది. విశాల ప్రాంగణం, పక్కా భవనం, అధునాతన ల్యాబ్‌లతో కాలేజీలో మెరుగైన వసతులు ఉన్నాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో కళాశాల విద్యార్థినులు 51.8 శాతం ఉత్తీర్ణ సాధించారు. ఎంపీసీ ఇంగ్లిష్‌మీడియంలో రామిశెట్టి దుర్గాభవాని 93 శాతం, తెలుగుమీడియం బైపీసీలో కె.నాగలక్ష్మి 73 శాతం, సీఈసీలో యు.కృష్ణవేణి 79.4 శాతం, హెచ్‌ఈసీలో తడికమళ్ల సులోచన 75.8 శాతం మార్కులు సాధించారు.
ఇంటర్‌లో ‘సర్కారు’ సత్తా
Published Sun, May 4 2014 2:32 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement