
అభివాదం చేస్తున్న టీవీ యాంకర్ మంగ్లీ , ప్రచారం చేస్తున్న మంగ్లీ, పిడమర్తి రవి
సాక్షి, సత్తుపల్లిటౌన్/సత్తుపల్లిరూరల్: రేలా.. రేలా.. రేలారే.. తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా.. ఇలా పాటలు ఆలపిస్తూ తెలంగాణ యాసతో టీవీ యాంకర్ మంగ్లీ ఉర్రూతలూగించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముందుగా యాంకరింగ్ చేయాల్సి ఉంది. కాని ట్రాఫిక్ జామ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన అనంతరం తళుక్కుమని స్టేజీ ఎక్కి.. అందరిని హలో.. హలో.. అక్కలు.. తమ్ముళ్లు.. అన్నలు.. సారీ.. లేటైంది.. అంటూ పలకరించారు. తెలంగాణ యాసతో అలరించింది. ఇంతలోనే జనం చేరుకోవటం.. స్టేజీ పైన కూడా నిండిపోవటంతో అసహనానికి లోనైంది. అనంతం పట్టణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవితో కలిసి ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment