సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకపాత్ర పోషించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో బీజేపీతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి సింగరేణి సంస్థ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
‘నేటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 7 లక్షల కోట్లు. ప్రతీ సంవత్సరం రూ. 70 వేల కోట్ల అప్పు కట్టాల్సిన ఆర్థిక సంక్షోభం కేసీఆర్ తీసుకొచ్చారు. పదేళ్ల లో అన్ని వ్యవస్థ లను విధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు వేశారు. మేము మార్చి 31 లోపు పూర్తి చేస్తామని చెప్పాం. కేటీఆర్, హరీష్‌రావులు అబద్దాలతోనే ఇంకా మోసం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత తప్ప ఇంకోకరు మాట్లాడడం లేదు. రోజు వారి ఆదాయాన్ని అంచనా వేసి చెల్లింపులు చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలు చేపడుతే.. నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు. 70 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మార్చి 6 న మరో 6 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.
...అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు కుంగిపోయాక నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా. కృష్ణా నది జలాలు ఎవరు కేంద్రానికి అప్పగించారో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ,బీజేపీ పదేళ్ల లో ఇచ్చిన హామీలు, మా గ్యారెంటీలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించేందుకు సిద్దమా. బీఆర్ఎస్ నేతల మాటలనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, సంవంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైంది. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిశాం. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కలవడం లేదు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఢిల్లీలో కాల్చి చంపారు. హైదరాబాద్ వరదలు వస్తే కేంద్రం సహాయం ఎందుకు చేయలేదు. రేపు సాయంత్రం 500లకు గ్యాస్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించబోతున్నాం. బీజేపీ, బీఆర్ఎస్‌లకు రాజకీయ స్వార్థం ఉంది .
...రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ,రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్. మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. వడ్డీ కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పోటీ పరిక్షలకు సిద్ధం అయ్యే వారికి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తాం. వైట్ రేషన్ కార్డు ప్రమానికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైవేలకు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. కేటీఆర్ ఔట్ సోర్సింగ్ పర్సన్’అని సీఏం రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment