సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వంపై ఒ త్తిడి తెచ్చి సింగరేణి ప్రైవేటీకరణను నిలుపుదల చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్ర భుత్వానిదేనని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. దేశానికి వెలుగులు పంచే సింగరేణిని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణిలోని నాలుగు గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నామని రేవంత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment