‘సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ’ | Bathukamma Celebrations In Singareni Bhavan | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 18 2018 2:43 AM | Last Updated on Thu, Oct 18 2018 2:43 AM

Bathukamma Celebrations In Singareni Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.కిషన్‌రావు అన్నారు. బుధవారం సింగరేణి భవన్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగను సింగరేణి కాలరీస్‌ ప్రాంతాల్లో ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా ఉద్యోగుల్లో మరింత అంకిత భావం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ ప్రేమ్‌కుమార్, జనరల్‌ సెక్రటరీ రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ బి.భాస్కర్‌ , సింగరేణి భవన్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement