తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్‌ రాజు | Dil Raju Apologises Over His Telangana Culture Comments | Sakshi
Sakshi News home page

Dil Raju: అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. హర్ట్‌ అయ్యుంటే క్షమించండి

Published Sat, Jan 11 2025 2:51 PM | Last Updated on Sat, Jan 11 2025 3:23 PM

Dil Raju Apologises Over His Telangana Culture Comments

సంక్రాంతి బరిలో గేమ్‌ ఛేంజర్‌ దిగిపోగా రేపు డాకు మహారాజ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు గేమ్‌ ఛేంజర్‌, ఇటు సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకు దిల్‌ రాజే నిర్మాత. అందుకే క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ల కోసం అటూ ఇటు పరుగులు తీస్తున్నారు.

నిజమాబాద్‌లో ఈవెంట్‌
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను తన సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈసారి స్పీచ్‌ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్‌ అయిపోవాలని యాంకర్‌ శ్రీముఖి కోరడం.. ఇప్పుడు చూడు, నా తడాఖా చూపిస్తా అన్న రేంజ్‌లో దిల్‌ రాజు రెచ్చిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే స్టేజీపై హుషారుగా మాట్లాడాడు.

దిల్‌ రాజు హుషారైన స్పీచ్‌
స్టేజీపై ఉన్న హీరో వెంకటేశ్‌ను చూస్తూ.. సర్‌, మా నిజామాబాద్‌ల తెల్ల కల్లు ఫేమస్‌. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్‌ ఉంటుంది. మా వోళ్లకు (తెలంగాణ ప్రజలకు) సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్‌ వైబ్‌ ఇస్తారు. తెలంగాణలో మటన్‌, తెల్లకల్లుకే వైబ్‌ ఇస్తారు అని స్పీచ్‌ దంచుకుపోయాడు. ఆయన స్పీచ్‌కు అక్కడున్నవారు చప్పట్లు కొట్టినా సోషల్‌ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణవాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడతాడా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై దిల్‌ రాజు (Dil Raju) స్పందించాడు.

(చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)

దావత్‌ గురించి మాట్లాడా..
మొన్నీ మధ్య నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌ చేశాం. నిజామాబాద్‌ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్లు జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్‌ మీట్‌ చేశాం.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది చేశాం. నిజామాబాద్‌వాసిగా ఆ జిల్లాతో నాకున్న అనుబంధం అలాంటిది! అందుకే అక్కడ ఈ మూవీ ఈవెంట్‌ చేశాం. అప్పుడు నేను మన కల్చర్‌లో ఉండే దావత్‌ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్‌ గురించి మాట్లాడాను. నా మాటలతో తెలంగాణవాళ్లను అవమానించానని, తెలంగాణను హేళన చేశానని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

క్షమించండి
నా ఉద్దేశమేంటో అదే స్పీచ్‌లో చెప్పాను. మన కల్చర్‌, దావత్‌ నేను మిస్‌ అవుతున్నాను.. సంక్రాంతికి నా రెండు సినిమాలు రిలీజయ్యాక తెలంగాణ దావత్‌ చేసుకోవాలనుందని చెప్పాను. మన విధానాలను నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్‌ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించండి అని చెప్పుకొచ్చాడు.

ఎలా అనుకున్నారు?
నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగ్‌ చేశాం. మనం కుటుంబానికి ఎంత విలువిస్తాం, మన కల్చర్‌ ఏంటనేది ఆ మూవీలో చూపించాం. ఫిదా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు. అలాగే బలగం చిత్రాన్ని కూడా అందరూ గుండెకు హత్తుకున్నారు​. తెలంగాణవాసిగా మన రాష్ట్రాన్ని అభిమానించే నేను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. మీ మనో భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. 

 రాజకీయాల్లోకి లాగకండి
ఎఫ్‌డీసీ చైర్మన్‌గా సినిమాకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుతాను. తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఎఫ్‌డీసీ సినిమాకు సంబంధించిందే కానీ రాజకీయాలకు సంబంధించినది కాదు. ఎఫ్‌డీసీ, నేను సినిమాలకే ఉపయోగపడతాం. అవసరంలేని విషయాల్లో నన్ను లాగొద్దని కోరుతున్నాను అన్నాడు.

 

 

చదవండి: ప్రభాస్‌ పెళ్లి ఎవరితో.. రివీల్‌ చేసిన రామ్‌ చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement