వారసత్వ ఉద్యోగాలు సాధిద్దాం | protests in SCCL on dependants employment scheme | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలు సాధిద్దాం

Published Mon, Apr 24 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

వారసత్వ ఉద్యోగాలు సాధిద్దాం

వారసత్వ ఉద్యోగాలు సాధిద్దాం

కొత్తగూడెం ‌: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సింగరేణిలో సమ్మె చేసైనా వారసత్వ ఉద్యోగాలు సాధిద్దామని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. సోమవారం పీవీకే 5ఇంక్లైన్‌ గనిలో హెచ్‌ఎంఎస్‌ పిట్‌ సెక్రెటరీ రాంశంకర్‌ కోరి ఆధ్వర్యంలో జరిగిన గేట్‌ మీటింగ్‌కు హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ హాజరై మాట్లాడారు.

2002 సంవత్సరంలో వారసత్వ ఉద్యోగాలు పూర్తిగా పోవుటకు ఒక్క ఏఐటీయూసీ నుంచి ఏడుగురు సంతకాలు పెట్టి పోగొట్టారన్నారు. ఈనెల 27వ తేదీన ఆర్‌ఎల్‌సీ దగ్గర వారసత్వంపై చర్చలు విఫలమైతే కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, నజీర్, అజీమ్, శ్రీనివాస్, క్రిష్ణమూర్తి, సుధాకర్, సహదేవ్, చిరంజీవి, దేవసహయం, రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement