
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికాకు చెందిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికిగానూ ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు ఎస్‌సీసీఎల్‌ని ఎంపిక చేశారు. అద్భుతమైన వృద్ధిరేటుతోపాటూ అసాధారణమైన పనితీరుతో సింగరేణి కాలరీస్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మార్చి 8న ముంబైలో లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్ . శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సీఈవో హేమంత్ కౌశిక్ , వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు.
SCCL Wins prestigious " India's best company award ", awarded by US consultancy firm Berkshire Media https://t.co/7rGutPG6rw, for its amazing growth rate and extraordinary performance. pic.twitter.com/ibfj447paA
— Singareni Public Relations (@PRO_SCCL) February 15, 2019