కేసీఆర్‌తోనే ‘వారసత్వం’ సాధ్యం | RTC chairman talking in singareni about heritage jobs | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే ‘వారసత్వం’ సాధ్యం

Published Wed, Sep 20 2017 9:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

కేసీఆర్‌తోనే ‘వారసత్వం’ సాధ్యం - Sakshi

కేసీఆర్‌తోనే ‘వారసత్వం’ సాధ్యం

ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ
గోదావరిఖని : సింగరేణిలో కొత్త ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతాయని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. జీడీకే–5వ గని, 11వ గనిపై మంగళవారం  ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లలో మాట్లాడారు. సింగరేణి సంస్థ 60 ఏళ్లుగా దోపిడీకి గురవుతోందని, సీమాంధ్రుల బారి నుంచి సింగరేణి సంస్థను కాపాడేందుకు కేసీఆర్‌ చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. ఇన్‌కంట్యాక్స్‌ రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనసభలో ఇన్‌కంట్యాక్స్‌ రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఎంపీలు ఢిల్లీ పార్లమెంట్‌లో మాట్లాడారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్‌ బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

యూనియన్‌ కేంద్ర ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ పీఎంఈ మస్టర్, యూనిఫాం, తండ్రి, మామ చనిపోతే ఉద్యోగాలు ఇప్పించామని, రెండో బిడ్డకు ప్రసవం, గనిలో చనిపోతే మ్యాచింగ్‌గ్రాంట్‌ రూ.20 లక్షలు అమలు చేయించామన్నారు. మేనిఫెస్టోలో 72 హామీలు పొందుపరిచామని, అందులో 60 హామీలు సాధించామని తెలిపారు. ట్రాన్స్‌ఫర్‌ క్వార్టర్స్‌ పారదర్శకంగా జరిగాయని, క్యాంటీన్లలో సౌకర్యాలు, కార్మికులకు టోపీ, లైట్లు, బూట్లు, అనేక హామీలు నెరవేర్చామన్నారు. జాతీయ సంఘాల మాటలు నమ్మకుండా టీబీజీకేఎస్‌ను ఆదరించి గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ యూనియన్ల నుంచి టీబీజీకేఎస్‌లో చేరిన శంకరయ్య, తేజ, తాయార్, టి.సురేష్, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, రాజ్‌కుమార్, వీరేశంతోపాటు 30 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఫిట్‌ సెక్రటరీ మోదుల సంపత్‌ ఆధ్వర్యంలో ఆర్జీ–1 ఉపాధ్యక్షుడు ఆరెళ్లి పోచం అధ్యక్షతన జరిగిన గేట్‌మీటింగ్‌లో కనకం శ్యాంసన్, నూనె కొమురయ్య, మాదాసు రామ్మూర్తి, గండ్ర దామోదర్‌రావు, వడ్డేపెల్లి శంకర్, మలికార్జున్, పెంచాల తిరుపతి, పుట్ట రమేశ్, రావుల అనిల్, గద్ద కుమారస్వామి, దాసరి శంకర్, మండ రమేశ్, నాయిని శంకర్, దుర్గం తిరుపతి, కెనాడి, చంద్రమౌళి, ఉప్పలయ్య, ఈదునూరి రామస్వామి, మల్లారెడ్డి, కుమార్, రమేశ్, చెల్పూరి సతీశ్, చెలుకలపెల్లి శ్రీనివాస్, రామస్వామి, పిల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వారసత్వం కేసీఆర్‌ దృఢ సంకల్పం
టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య

యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య అన్నారు. వకీల్‌పల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్ని కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులతో హుటాహుటిన సమావేశమై చర్చించారన్నారు. సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌కు కూడా ప్రత్యేక ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఈమేరకు గత స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో సీఅండ్‌ఎండీ ఈప్రస్తావన తీసుకవచ్చారన్నారు.

జాతీయ సంఘాల నాయకులు జేబీసీసీఐ ఒప్పందాలపై సంతకాలు చేయకుండా మరోసారి మోసం చేయాలని చూస్తోందన్నారు. సింగరేణిలో ఎన్నికలు ఉన్నాయనే కారణం చూపి సంతకాలు చేయకుండా ఆపుతున్నారని, ఎన్నికల తర్వాత సంతకాలను చేసి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తునారన్నారు. దీన్ని కార్మిక వర్గం గమనించి రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటువేసి టీబీజీకేఎస్‌కు గెలిపించాలని కోరారు. గేట్‌మీటింగ్‌లో ఐలి శ్రీనివాస్, బదావత్‌ శంకర్‌నాయక్, కొంగర రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement