అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆధునిక యంత్రాలు | Modern machines for underground mines | Sakshi
Sakshi News home page

అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆధునిక యంత్రాలు

Published Thu, Jun 9 2016 9:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆధునిక యంత్రాలు - Sakshi

అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆధునిక యంత్రాలు

ఎస్‌డీఎల్స్ స్థానంలో కంటిన్యూయస్ మైనర్లు?
ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ‘ఆధునికత’పై దృష్టి పెట్టిన సింగరేణి

 
గోదావరిఖని(కరీంనగర్) : రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న సింగరేణి యూజమాన్యం లక్ష్యాలను చేరుకోవడానికి ఆధునిక యం త్రాలను వినియోగించాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగా భూగర్భగనుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎస్‌డీఎల్ లాంటి యంత్రాల తో టార్గెట్లు చేరుకోలేమని గ్రహించిన కంపెనీ వాటి స్థానంలో కంటిన్యూయస్ మైనర్ యం త్రాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది.  ప్రసుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భగనుల ద్వారా రోజుకు 44వేల టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

అరుుతే 32వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కంపెనీ వ్యాప్తంగా 156 ఎస్‌డీఎల్(సైడ్ డంపర్ లోడర్) యంత్రాలు వినియోగంలో ఉన్నాయి. వీటి ద్వారా సరాసరిగా రోజుకు 20వేల టన్నుల బొగ్గు వెలికి తీయూల్సి ఉండగా 15వేల టన్నుల వరకు వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 7 వరకు ఎస్‌డీఎల్ యంత్రాలకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 11,37,664 టన్నులు కాగా 9,57,760 టన్నులు మాత్రమే వెలికితీశారు. యంత్రాల పనితీరు సరిగ్గా లేకపోవ డం వల్లే ఆశించిన ఉత్పత్తి రావడం లేదనేది స్పష్టమవుతోంది. తరుచూ మరమ్మతులకు రావడం, నిర్వహణ సరిగా లేకపోవడం, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండకపోవడం, ఆయి ల్ లీకేజీలు పెరిగిపోవడం, వైబ్రేషన్స్ అధికం కావడం ఇందకు కారణంగా తెలుస్తోంది.

పనిస్థలాల్లో యంత్రం బొగ్గును తీసుకుని తిరిగి బెల్ట్‌పై పోసేందుకు వీలుగా మూల మలుపులు అనువుగా లేవు. యంత్రాన్ని నడిపించే ఆపరేట ర్ కూర్చోవడానికి సీట్ అనుకూలంగా లేక వెన్నుపూస సమస్యలు ఎక్కువై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఎస్‌డీఎల్ యంత్రానికి ఉన్న బకెట్ ద్వారా ఒక ట్రిప్పునకు ఒకటి నుంచి ఒకటిన్నర టన్ను మాత్రమే బొగ్గు తీసే సామర్థ్యం ఉంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఎస్‌డీఎల్ యంత్రాల స్థానంలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను ప్రవేశపెట్టాల నే ఆలోచనతో యాజమాన్యం ఉంది.


మరిన్ని గనుల్లో ఏర్పాటుకు అవకాశం
ఇందులో భాగంగానే ఇటీవల సింగరేణి డెరైక్టర్ మనోహర్‌రావు, ఇతర అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు చెందిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన సింగరేణి బృందాన్ని అమెరికాలోని బొగ్గుగనుల సందర్శనకు పం పించింది. వీరు అక్కడి ఆధునిక యంత్రాలతో నడుస్తున్న పలు బొగ్గుగనులు, ప్రాజెక్టులు, కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను తయారు చేసే క్యాటర్‌ఫిల్లర్ సంస్థను సందర్శించి యం త్రాలను పరిశీలించారు. సింగరే ణిలో ప్రస్తుతం భూగర్భగనుల్లో గ్రేడియంట్‌లో హెచ్చు తగ్గులు ఉన్నారుు. వాటికి అనుగుణంగా కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను తయారు చేయడానికి క్యాటర్‌ఫిల్లర్ సంస్థ సుముఖంగా ఉన్నట్లు తెలియడంతో సింగరేణి బృందం ఆ విషయా న్ని సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లింది.

భూగర్భగనుల్లో కంటిన్యూయస్ మైనర్ యంత్రాల ను ప్రవేశపెట్టడానికి సీఎండీ సానుకూలత చూపినట్లు సమాచారం. ప్రస్తుతం జీడీకే-11, వీకే-7 గనుల్లో కంటిన్యూయస్ మైనర్ యం త్రాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది మందమర్రి ఏరియూ పరిధి శాంతిఖని గనిలో ప్రవేశపెట్టనున్నారు. యాజమాన్యం చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో మరిన్ని కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లో కీలకంగా పనిచేయనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement