► రెండు రకాల విధులతో పనిభారం
► చిన్న పొరపాటు జరిగినా పనిష్మెంట్లు
► ఆందోళన చెందుతున్న మైనింగ్ స్టాఫ్
కాసిపేట(ఆదిలాబాద్) : సింగరేణి భూగర్భగను ల్లో హ్యండ్‌సెక్షన్ పనులు కనుమరుగయ్యూరుు. ఆయూ విధులు నిర్వర్తిం చే మైనింగ్ స్టాఫ్(సర్దార్, షార్ట్‌ఫైరర్)తో అధికారులు మిషన్ పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ స్టాఫ్ సుమారు 2000 మంది ఉన్నారు. సర్దార్, షార్ట్ ఫైరర్ విధులు ఒక్కరికే అప్పగించడం వల్ల పనిభారం, మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నామని అంటున్నారు. ఇంతచేసినా మైనింగ్ స్టాఫ్‌గా పరిగణించే తమను అటు అధికారులుగా, ఇటు కార్మికులుగా కాకుండా చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో హ్యండ్‌సెక్షన్ వద్ద 25 మంది పనిచేసే చోట సర్ధార్, షార్ట్‌ఫైరర్ విధులు నిర్వహిం చేదని, ప్రస్తుతం ఎస్‌డీయల్ యంత్రాల వద్ద పనులు చేస్తున్న వారికి అదే నియ మం వర్తింపచేస్తున్నారని తెలిపారు.
రెండు మూడు యంత్రాలు నడిచే డిస్ట్రిక్‌లో సైతం ఒక్కరికే విధులు కేటారుుస్తుండడంతో అన్ని పనులు చూసుకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి పోరపాటు జరిగినా బాధ్యులను చేస్తూ పనిష్మెంట్లు ఇవ్వడం వల్ల మానసిక ఒత్తిడికి తట్టుకోలేక పోతున్నామని పేర్కొంటున్నారు. గతంలో ఓటీ(ఓవర్‌టైం) కట్టించడంతో ఇబ్బంది కలి గినా గత్యంతరం లేక పనులు చేశామని, ప్రస్తుతం ఓటీ లేకుండా బలవంతంగా పనిచేయిస్తున్నారని, డీజీఏంఎస్ ఆదేశాలు పట్టించుకుకే వారే లేరని అన్నారు. సర్ధార్ పనులు పర్యవేక్షించాలి.. షార్ట్ ఫైరర్ బ్లాస్టింగ్‌లు చేరుుంచాలి.. రెండు పనులు ఒక్కరితోనే చేరుుంచడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సిబ్బం ది కొరత సాకుతో పనిభారం మోపడం సరికాదని, ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని మైనింగ్ స్టాఫ్ కోరుతున్నారు.
డబుల్ ట్రబుల్
Published Fri, Mar 11 2016 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement