Poland country
-
‘పారిస్ కల’ నెరవేర్చే దిశగా...
పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో మూడేళ్లక్రితం 200 దేశాల మధ్య కుదిరిన ఒడంబడికలోని అంశాల అమలుకు సంబంధించిన ఆచరణాత్మక ప్రణాళికల్ని రూపొందించేందుకు పోలాండ్లోని కటోవీస్‌లో పక్షం రోజులు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–24 సదస్సు మొదలైంది. బొగ్గు, మరికొన్ని శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించుకోనట్టయితే కర్బన ఉద్గారాల కారణంగా పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదమున్నదని చాన్నాళ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించుకున్న లక్ష్యాలను మించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని రెండు నెలలక్రితం ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం తేల్చిచెప్పింది. ఆ బృందం కీలకమైన అంశాన్ని అందరి దృష్టికీ తెచ్చింది. పారిస్ ఒడంబడిక ‘భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాల’ని పిలుపునిచ్చింది. అయితే సమితి బృందం దీన్ని స్పష్టంగా 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలిపితేనే ముంచుకొస్తున్న ముప్పును నివారించగలమని అంటున్నది. లేనట్టయితే వాతావరణ మార్పులు ఊహించని స్థాయిలో ఉత్పాతాన్ని తీసుకొస్తాయని హెచ్చరించింది. పారిస్ ఒడంబడిక అమలుకు రూపొందించుకోవాల్సిన నియమ నిబంధనలపై గత రెండే ళ్లుగా చర్చలు సాగుతున్నాయి. నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేని దేశాలపైనా, దాన్ని ఉల్లంఘిస్తున్న దేశాలపైనా తీసుకునే చర్యలు, దీన్నంతటినీ పర్యవేక్షించాల్సిన యంత్రాంగం స్వరూపస్వభావాలు నియమనిబంధనల్లో పొందుపర్చాల్సి ఉంది. అలాగే సభ్యదేశాలకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. వాటితోపాటు ఉద్గారాలను కొలిచే ప్రమాణాలను, పర్యవేక్షక యంత్రాంగానికి అవసరమైన వనరుల కల్పనను కూడా చర్చించారు. కటోవీస్ సదస్సు నాటికల్లా ఈ చర్చలు పూర్తయి అప్పటికల్లా ఇవన్నీ ఖరారు కావాలన్నది కాప్–24 నిర్వాహకుల లక్ష్యం. వచ్చే వారమంతా కూడా కొనసాగే ఈ సదస్సు నిర్వాహకులు రూపొందించిన నియమ నిబంధనలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలపవలసి ఉంది. అలాగే ఉద్గారాల తగ్గింపు నకు ముందుకొచ్చే వెనకబడిన దేశాలకు అవసరమైన ఆర్థిక వనరుల్ని, సాంకేతికతను సమకూర్చేం దుకు సంపన్న దేశాలు ఏమేరకు హామీ ఇవ్వగలవో ఈ సదస్సులో నిర్ణయం కావాల్సి ఉంది. 2016 లో మొరాకోలోని మర్రకేష్‌లో కాప్–22 సదస్సు జరిగినప్పుడు 2018 కల్లా నియమ నిబంధనలు ఖరారు కావాలని నిర్ణయించారు. అయితే కటోవీస్ సదస్సు ముంగిట్లోకొచ్చినా చర్చల పరంపర పూర్తికాలేదు. అంతర్జాతీయ ఒడంబడికల్ని అమలు చేసి తీరాలని వెనకబడిన దేశాలను ఒప్పించడం చాలా సులభం. కానీ సంపన్న దేశాలపై ఇలా ఒత్తిడి తీసుకురావడం ఓ పట్టాన సాధ్యం కాదు. అలాగే వెనకబడిన దేశాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని, సాంకేతికతను అందించమని వాటికి నచ్చజెప్పి ఒప్పించడం కూడా కష్టం. ఈ రెండేళ్లలోనూ నిర్వాహకులకు అది బాగా అర్ధమైంది. ఉద్గారాల తగ్గింపుపై పారిస్ శిఖరాగ్ర సదస్సులో తాము వాగ్దానం చేసిన లక్ష్యాలను గడువుకు ముందే నెరవేరుస్తామని, ఆ లక్ష్యాలను దాటి కూడా ముందుకెళ్తామని కాప్–24లో మన దేశం తర ఫున పాల్గొన్న కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇది సంతోషించదగ్గదే. పారిస్ సదస్సులో మన దేశం 2030కల్లా ఉద్గారాల తీవ్రతను 2005నాటి స్థాయితో పోలిస్తే 33–35 శాతం మేర తగ్గించుకుంటామని హామీ ఇచ్చింది. ఆమేరకు పునర్వినియోగ ఇంధన వనరుల్ని పెంచుకో వాల్సి ఉంది. ఈ విషయంలో హామీ ఇచ్చినదాని కంటే ఎక్కువగా... గడువుకంటే ముందుగా భారత్ చేసి చూపగలిగితే అది అటు సంపన్న దేశాలకూ, ఇటు వర్ధమాన దేశాలకూ ఆదర్శనీయ మవుతుంది. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను భారీగా విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ శతాబ్దాంతానికి భూతాపం మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరగొచ్చునని శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు అందరిలో గుబులు పుట్టిస్తున్నాయి. భూతాపం పెరుగుతున్నకొద్దీ రుతువులు గతి తప్పి కరవుకాటకాల బారినపడతాయి. అదే జరిగితే 2030నాటికి మరో 12.2 కోట్లమంది పేదరికంలోకి జారిపోతారని ఆమధ్య ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అంతేకాదు... జనం అంతుచిక్కని ప్రాణాంతక అంటు రోగాలబారిన పడతారని తెలిపింది. అనేక తీర ప్రాంత దేశాలు ముంపు బారిన పడతాయని వివరించింది. ఇప్పుడు ఉగ్రవాదం కారణంగా సిరియా, నైజీ రియా, లిబియా వంటి దేశాలనుంచి శరణార్థులు యూరప్ దేశాలకు వలసపోతున్నట్టే మున్ముందు భూతాపం హెచ్చడం వల్ల కలిగే అనర్థాలను తట్టుకోలేక మాల్దీవులు, ఫిలిప్పీన్స్ తదితర దేశాల జనం వలసబాట పట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలు యుద్ధాలకు దారితీస్తాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఇవేమీ పట్టడం లేదు. అసలు పర్యావరణ ఉత్పాతం భావనే శాస్త్రవేత్తల విశ్వామిత్ర సృష్టిగా ఆయన కొట్టిపారేస్తున్నారు. ఈ సదస్సుకు కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ మినహా అమెరికా నుంచి చెప్పుకోదగ్గ ముఖ్య నాయకులెవరూ రాలేదు. అటు ముప్పును అంగీకరించే ఇతర సంపన్న దేశాలైనా ఉదారంగా వ్యవహరించడం లేదు. ఒకపక్క పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలేదని అమెరికాను దుయ్యబడుతూనే ఆ దేశాలు కూడా ఆచరణలో అందుకు భిన్నంగా ఏమీ ఉండటం లేదు. వర్ధమాన దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం విషయంలోనూ, అవసరమైన సాంకేతికతను సమకూర్చడంలోనూ ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో కటోవీస్ సదస్సు విజయవంతమవుతుందా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. భూమండలం ముప్పు ముంగిట్లో ఉన్న ఈ తరుణంలోనైనా సంపన్న దేశాలు, పేద దేశాలు సమష్టిగా, సమన్వయంతో కదలవలసిన అవసరం ఉంది. పారిస్ ఒడంబడిక లక్ష్యాలు నెర వేరడానికి అనువైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను కటోవీస్ సదస్సు రూపొందిస్తుందని ఆశిద్దాం. -
ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. పొమ్మన్నాడు..!
సాక్షి, విశాఖపట్నం: ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరారు. కొన్నాళ్లకు మనసులు కలిశాక ఒకరికొకరు చేరువయ్యారు. ఆమెను పెళ్లాడుతానని మాటిచ్చాడు. ఇద్దరి మతాలు వేరవడంతో తమ తల్లిదండ్రులు పెళ్లికి ఇష్టపడరని ప్రియుడు ప్రియురాలికి చెప్పి ఆమెతో సహజీవనం సాగించాడు. అతడిని నమ్మిన ఆమె తన శరీరాన్నే కాదు.. కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయల జీతాన్నీ ఇచ్చేసింది. ఇలా నాలుగేళ్లు గడిచాక ఉన్నత విద్యాభ్యాసం పేరిట పోలెండ్‌కు వెళ్లిపోయాడు. అటు నుంచి వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మాట ప్రకారమే పెళ్లి చేసుకున్నాడు.. కానీ ప్రియురాలిని కాదు.. మరో యువతిని. ఆ సంగతి తెలిసిన ప్రియురాలు నిలదీయడంతో మతాలు వేరు కావడం వల్ల తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, మరో దారి చూసుకోమని సలహా ఇచ్చి భార్యతో పోలెండ్ వెళ్లిపోయాడు. పరాయి రాష్ట్రం జార్ఖండ్ నుంచి వచ్చిన ఆమె విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో విశాఖలోని ప్రియుని ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమవుతోంది. తనలా మరో యువతి మోసపోకూడదంటూ ఆమె పోరుబాట పట్టనుంది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన సోనీకుమారిసింగ్, విశాఖ పరిధి కంచరపాలెంకు చెంది న రఫీషేక్‌లు విశాఖ రుషికొండలోని సదర్లాండ్ గ్లోబల్ కంపెనీ అనే బీపీవో సంస్థలో సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉద్యోగం చేసేవారు. అక్కడ వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ల అనంతరం 2012లో ఆ సంస్థ శాఖ విశాఖలో మూతపడడంతో ఉద్యోగులను చెన్నైకి బదిలీ చేసింది. సోనీకుమారి, రఫీషేక్‌లు చెన్నైకి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికొచ్చిన వీరు చెన్నై, ఢిల్లీల్లో కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఉన్నత విద్యనభ్యసిస్తే మెరుగైన ఉద్యోగం వస్తుందని, అప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవచ్చని, పెళ్లికి తమ తల్లిదండ్రులను కూడా ఒప్పించానని సోనీని రఫీ నమ్మించాడు. అక్కడ చదువుకు రూ.2 లక్షలు అవసరమవుతుందని చెప్పడంతో తాను కష్టించి సంపాదించిన జీతం సొమ్మును ఇచ్చింది. దీంతో రఫీ 2013లో పోలెండ్ ఉన్నత చదువులకు వెళ్లాడు. అప్పటి నుంచి ఏటా ఒకసారి వచ్చి చెన్నైలో ఉంటున్న సోనీతో కొన్నాళ్లు గడిపి వెళ్లేవాడు. అక్కడ చదువు పూర్తి కాగానే ఉద్యోగంలోనూ చేరాడు. 2018లో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో సోనీ తమ వివాహం గురించి రఫీని ఒత్తిడి చేసేది. 2017 సెప్టెంబర్ వరకు సఖ్యతగా ఉన్న ఆయన ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇద్దరివి వేర్వేరు మతాలు కావడంతో ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, అందువల్ల మరొకరితో వివాహం చేసుకోవాలని సూచించాడు. అందుకు ఆమె సమ్మతించకపోవడంతో తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కొంత సమయం కావాలన్నాడు. ప్రియుడి మోసాన్ని జీర్ణించుకోలేని సోనీకుమారి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగాన్ని వదిలేసి రాంచీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతలో ఈ ఏడాది జనవరి 7న రఫీ మరొక మహిళను విశాఖలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న సోనీకుమారి అదే నెల 10న కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి మోసం చేసిన రఫీ షేక్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇప్పటిదాకా రఫీపై పోలీసులు చర్యలు తీసుకోలేదని, పైగా ఆ కుటుంబంతో రాజీ కుదుర్చుకోమని సలహా ఇస్తున్నారని సోనీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జాయింట్ పోలీస్ కమిషనర్ డి.నాగేంద్రకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. రఫీ ఇంటి ముందు ఆందోళనకు దిగుతా రఫీ షేక్ నన్ను మోసం చేసి మరో మహిళను పెళ్లాడాడు. ఆర్థికంగానూ నష్టపరిచాడు. నాలా మరే మహిళా రఫీ చేతిలో మోసపోకూడదు. అందుకే రఫీ ఇంటి ఎదుట ఆందోళన చేపడతా. నాకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తా. – సోనీకుమారిసింగ్, బాధితురాలు అరెస్టు నోటీసులు జారీ చేశాం బాధితురాలు సోనీకుమారిసింగ్ ఫిర్యాదు మేరకు రఫీషేక్ అరెస్టుకు నోటీసులు జారీ చేశాం. సోనీకుమారి ఢిల్లీలోనూ రఫీషేక్‌తో సహజీవనం చేయడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించాం. కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఢిల్లీకి పంపుతాం. – డి.నాగేంద్రకుమార్, జాయింట్ పోలీస్ కమిషనర్ -
కార్మిక శ్రేయస్సుకే పెద్దిపీట
పోలాండ్ దేశంలోని 14 భూగర్భగనులు, 4 ఓపెన్‌కాస్ట్‌లు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 135 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. భూగర్భ గనుల్లో ఏటవాలుతనం ఎక్కువ గా ఉన్నప్పటికీ కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నా రు. సింగరేణిలో సరాసరి 325 మీటర్ల లోతు లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే.. ఇక్కడ 940 మీటర్ల లోతులోని బొగ్గును వెలికితీస్తున్నారు. అంతలోతున కూడా ఏసీలను బిగించి పనిచేసే ఉద్యోగులకు గాలి సక్రమంగా అందిస్తున్నారు. సింగరేణిలో ఒక ఓసీపీలో ఏటా తీసే బొగ్గును అక్కడ ఒక భూగర్భ గని ద్వారా తీస్తున్నారు. భూగర్భ గనిలో పనిప్రదేశానికి వెళ్లడానికి వీలు గా ప్రత్యేకమైన కార్లున్నాయి. పనిస్థలంలో బొగ్గు దుమ్ము పడితే ఎత్తడానికి మూడు షిఫ్టు లు ఉద్యోగులు పనిచేస్తారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఎక్కడా డంపర్లు కనిపించవు. ఇన్ఫిట్ క్రషర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగిన వెంటనే బెల్ట్ ద్వారా ఉపరితలానికి పంపిస్తారు. ఇక్కడి గనుల్లో సింగరేణితో పోల్చితే మా నవ వనరుల సంఖ్య తక్కువ. పోలాం డ్లో అధికారులు, ఉద్యోగులందరు ఒకే దుస్తులు ధరించాలి. ఇంటి వద్ద నుంచి ఏసీ బస్సులలో గనుల వద్దకు తీసుకెళ్తారు. వేతనాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ సంక్షేమం విషయంలో ఉద్యోగులకు క్వార్టర్లు, ఆసత్రి సౌకర్యం ఉండదు. ఉద్యోగులే ప్రైవేటుగా ఇళ్లలో ఉండి.. ఆ అద్దెబిల్లును, ఆస్పత్రికి వెళితే ఆ బిల్లును సమర్పిస్తే యా జమాన్యం ఆ బిల్లులను వేతనంలో కలిపి ఇస్తుంది. ఉద్యోగులపై ఇక్కడ ఇన్సూరెన్స్ చేస్తారు. వారు ఒక వేళ మరణించినా.. గాయపడ్డా ఆ మేరకు ఇన్సూరెన్స్‌ను వర్తింపజేస్తారు. ఇక్కడ ఏ వృత్తి పనివారితో ఆ పనులే చేయిస్తారు. ఒకవేళ ఉద్యోగ విరమణ చేస్తే ఆ రోజు వరకు కూడా వేతనం జమచేసి మూడు రోజు ల్లోగా పూర్తి డబ్బులు చెల్లిస్తారు. గనులపై ప్రత్యేకంగా క్యాంటీన్లలో తినుబండారాల సౌకర్యం ఉండదు. కేవలం కూల్‌డ్రింక్స్ తప్ప వేటిని అందుబాటులో పెట్టరు. భూగర్భ గనిలో ఉద్యోగులు తెచ్చుకున్న భోజనాన్ని భుజించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దక్షిణాఫ్రికాలో కూడా అపారమైన బొగ్గు నిల్వలుండగా.. భారతదేశంలో కోల్ఇండియా, సింగరేణిలో చేస్తున్నట్టుగానే బొగ్గు గనులు, ఓసీపీల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. మోజాంబిక్‌లో పరిస్థితులు దారుణం.. మోజాంబిక్‌లో బొగ్గు నిల్వలున్నప్పటికీ ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇది చిన్నదేశమైనా మొత్తం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలోనే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటుంది. ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు అసలే లేవు. ప్రస్తుతం చైనా దేశానికి చెందిన కంపెనీల ఆధ్వర్యంలో 64 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే.. భారతదేశానికి చెందిన కంపెనీల ఆధ్వర్యంలో 9 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. ఓపెన్‌కాస్ట్‌లలో 35 మీటర్ల లోతులోనే నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుండడంతో ఈ దేశంపై వివిధ దేశాలు కన్నేశాయి. భారతదేశానికి చెందిన జిందాల్ కంపెనీ ఒక ఓసీపీని నిర్వహిస్తుండగా.. వారే 400 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా ట్రక్కులలో బొగ్గును రవాణా చేసి, అక్కడి నుంచి మరో 300 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్‌లైన్ నిర్మాణం చేసుకుని బొగ్గును తమ సొంత విద్యుత్ ప్లాంట్‌కు రవాణా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో 80 శాతం మేర విద్యుత్ ఉండని ప్రాంతాలున్నాయి. ప్రైవేటు కంపెనీ కావడంతో డంపర్లు నిలిచిపోయేందుకు అక్కడి యాజమాన్యం అంగీకరించదు. నిరంతరం వాటిని నడుపుతూనే ఉండాలి. ఒక ఇక్కడి ఓసీపీలో ఒక్క భారతీయుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే మోజాంబిక్ దేశస్తులను మరో 10 మందిని ఉద్యోగాల్లోకి తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి కారణాల వల్ల ఇక్కడ బొగ్గు ఉత్పత్తి తీయడానికి వ్యయం ఎక్కువగా అవుతున్నది. అయితే ఎవరైనా బొగ్గు గనులను, ఓసీపీలను ప్రారంభించడానికి కంపెనీలకు అవసరమైన పర్యావరణ అనుమతులు మాత్రం వేగవంతంగా ఇస్తారు. ప్రస్తుతం మోజాంబిక్‌లో కోల్ఇండియా, ఆఫ్రికా సంయుక్తంగా ప్రాజెక్టును తీసుకోగా...బొగ్గు ఉత్పత్తి ఇంకా వెలికితీయలేదు.