బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి | 16 Dead In Underground Coal Mine Accident In China | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి

Sep 27 2020 3:06 PM | Updated on Sep 27 2020 7:06 PM

16 Dead In Underground Coal Mine Accident In China - Sakshi

కన్వేయర్‌ బెల్ట్‌ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలైందని, దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారు.

బీజింగ్‌: చైనాలోని భూగర్బ బొగ్గు గనిలో పనిచేస్తున్న 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నైరుతి చైనాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్వేయర్‌ బెల్ట్‌ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలైందని, దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని చైనా అధికారిక వార్తా సంస్థ జింగ్వా పేర్కొంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్‌ జిల్లా యంత్రాంగం సోషల్‌ మీడియాలో వెల్లడించింది. కాగా, ప్రమాదం జరిగిన చోఘింగ్‌ ఎనర్జీ సంస్థ ప్రభుత్వం అధీనంలో నడుస్తోంది.

భద్రత కరువు
చైనాలో బొగ్గు గనుల్లో ప్రమాదాల సాధారణమైపోయాయి. భద్రతా పరమైన నిఘా లేకపోవడం, అధికారుల వైఫల్యం కారణంగా ఎంతోమంది అమాయకులు, మైనర్లు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన ఓ బొగ్గుగని, గ్యాస్‌ పేలుడు ఘటనలో 14 మంది మైనర్లు మృతి చెందారు. 2018 డిసెంబర్‌లో ఇదే చోఘింగ్‌ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్లు మృతి చెందారు. 2018  అక్టోబర్‌లో షాన్‌డోంగ్‌ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో  21 మైనర్లు ప్రాణాలు విడిచారు. బొగ్గు పెళ్లలు విరిగిపడంతో బయటకు రాలేక 22 మంది చిక్కుకు పోగా.. ఒకరిని మాత్రమే రక్షించగలిగారు.
(చదవండి: కరోనాని కట్టడి చేయకపోతే.. 20 లక్షల మంది బలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement