కాసిపేట : కాసిపేట మండలంలోని పల్లంగూడ, కనికలాపూర్ గ్రామాల మధ్య చేపట్టనున్న కాసిపేట 2 ఇంక్లైన్ నూతన గని నిర్మాణానికి సంబంధించి భూసేకరణను రెవెన్యూ, సింగరేణి అధికారులు వేగవంతం చేశారు. నిర్వాసిత రైతులకు ఎలాగోలా నచ్చజెప్పి ఒప్పించడంలో అధికారులు సఫలమయ్యారు. గనికి 82 ఎకరా లు అవసరం కాగా.. 49 మంది రైతులకు చెందిన భూమి తీసుకోనున్నారు.
నూతన భూే సకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు పట్టుపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు దిగి వచ్చి నూతన భూసేకరణ చట్టం ప్రకారం చెల్లిస్తామని హా మీ ఇచ్చారు. అయితే నూతన చట్టం మార్గదర్శకాలు వెల్లడి కానందున రైతులు వెల్లడి అయిన తరువాత భూమి ఇస్తామని దాటవేస్తూ వచ్చారు. నూతన భూగ ర్భ గనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు.
మంచిర్యాలలో చర్చలు
ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం నిర్వాసిత రైతులను మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి పిలిచి ఆర్డీవో, సింగరేణి అధికారులు చర్చలు నిర్వహించా రు. నూతన చట్టం ప్రకారం పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలు తదితర డిమాండ్లు నిర్వాసితులు అధికారుల ముందు పెట్టారు. దీనిపై అధికారులు ప్రస్తుతం ఉద్యోగాలు ఇవ్వడం తమ పరిధిలో లేదని సీఅండ్‌ఎండీతో మా ట్లాడి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్ర స్తుతం నిర్ణయించిన ధర కాకుండా కొత్త చట్టం అమ లు ప్రకారం భూములకు పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు పాత ధర కంటే అధికంగా రూ.3.69 లక్షలు చెల్లించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం రూ.4 లక్షలు చెల్లించాలని, మిగతా సొమ్ము నూతన చట్టం ప్రకారం చెల్లించాలని కోరగా... ఉన్నతాధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలుపడంతో నిర్వాసితులు అంగీకరిం చారు. గ్రామాల అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో ఒ ప్పందం కుదిరితే అభ్యంతరం లేదని చెప్పారు. దీం తో అభివృద్ధిపై యాజమాన్యం హామీ ఇచ్చి రైతుల ద్వారా అగ్రిమెంటు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
అక్టోబర్ నాటికి ప్రారంభించాలని...
అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ సంవత్సరం అక్టోబర్ వరకు నూతన గని పనులు ప్రారంభించనున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు నూతన గనులు ఏర్పాటు కానుండగా కాసిపేట 2 ఇంక్లైన్ గని మొదటగా ఉత్పత్తి సాధించనుంది. కాసిపేట గని ద్వారా కాసిపేట, ముత్యంపల్లి గ్రామాలు నష్టపోయిన కారణంతో ఓపెన్‌కాస్టు, గనులకు స్థానికులు అడ్డంకులు సృష్టించినా నూతన గని విషయంలో అడ్డంకులు తీరడంతో అధికారులు ఆనందంలో నిర్మాణానికి ముందుకు వస్తున్నారు.
భూ సేకరణ వేగవంతం
Published Wed, Aug 13 2014 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement