పలమనేరు: కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు బుధవారం రూ.50లక్షల విలువైన 164 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఒక కంప్రెషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుడుపల్లె పోలీసులకు అప్పగించారు. భూగర్భగనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు మైనింగ్ ఏడీ వేణుగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment