శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీ చౌరస్తా నుంచి జైపూర్ పవర్ ప్లాంటు వరకు ఉన్న రోడ్డును విస్తరించి నాలుగు లేన్ల రహదారిగా మారుస్తున్నామని శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం తన చాంబర్‌లో ఉత్పత్తి వివరాల కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. పవర్ ప్రాజెక్టు అవసరాల కోసం నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని దీని కోసం ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను కంపెనీ రూ.19 కోట్లను ప్రభుత్వ జాతీయ రహదారుల శాఖకు ఇచ్చామని, వారి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయన్నారు.
108 శాతం ఉత్పత్తి
శ్రీరాంపూర్ ఏరియాలో అక్టోబర్‌లో 108 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా ఏరియా ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందన్నారు. గత నెల వరకు 114 శాతం ఉత్పత్తి నమోదైన శ్రీరాంపూర్ ఓసీపీలో సమస్య రావడం వల్ల లక్ష్యాన్ని సాధించలేదన్నారు. ఓబీ కోసం భూ సమస్య రావడం వల్ల గత నెల కంటే 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింద ని చెప్పారు. గతేడాదితోపోల్చితే ఈ యేడు 30 శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. సింగరేణి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు అనుమతించమన్నారు. సింగరేణి మైనింగ్ అవసరాల కోసం ఫారెస్టు శాఖ నుంచి లీజు తీసుకుందని మళ్లీ తిరిగి భూమి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటు సీజీఎం సత్యనారాయణ, డీజీఎం(ఐఈడీ) ఫణి, డీజీఎం(పర్సనల్) శర్మ, పీఎం కిరణ్‌కుమార్ ఉన్నారు.
ఏరియాలో 76 శాతం ఉత్పత్తి
రెబ్బెన : గత అక్టోబర్‌లో బెల్లంపల్లి ఏరియాలోని గనులు 76 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయని ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ తెలిపారు. శనివారం గోలేటిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌లో ఏరియా లక్ష్యం 5,32,400 టన్నులు కాగా 4,05,740 టన్నులు సాధించి 76శాతం నమోదు చేశాయన్నారు. బెల్లంపల్లి ఓసీపీ-2 ఎక్స్‌టెన్సన్ ఓసీపీలో అక్టోబర్ లోనే ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా అబ్బాపూర్ గ్రామానికి పునరావాసం కల్పించిన తర్వాత ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. అలాగే డోర్లి-2 ఓసీపీలో సైతం ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాకపోవటంతోనే నెల వారీ లక్ష్యాన్ని సాధించలేకపోయామని తెలిపారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ చిత్తరంజన్‌కుమార్, డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ యోహాన్ పాల్గొన్నారు.
జైపూర్ వరకు ఫోర్‌లేన్ నిర్మాణం
Published Sun, Nov 2 2014 4:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement