సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఆ 4 నెలలు ఎంతో కీలకమని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 700 లక్షల టన్నులకుగానూ రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు.
శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, ఉత్పత్తి అయిన బొగ్గును వినియోగదారులకు అందించడం కోసం తగినన్ని రేకులను సమకూర్చుకోవడానికి కోల్ మూమెంట్ శాఖ రైల్వే వారిని సమన్వయపరచుకుంటూ ముందుకువెళ్లాలని శ్రీధర్ సూచించారు.
సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్, పర్సనల్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్), డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్ ఎన్. బలరామ్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, అడ్వైజర్ డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్ జీ.ఎం. (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె. సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) సీహెచ్. నర్సింహారావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment