సింగరేణికి సన్‌స్ట్రోక్
తగ్గుతున్న కార్మికుల హాజరు శాతం
ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో విపరీతమైన వేడి
బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం
ఒకవైపు మండుతున్న ఎండలు. మరో వైపు విపరీతమైన వడగాల్పులు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి కాలుబయటపెట్టలేని పరిస్థితి. వీటికి తోడు బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడే భారీ యంత్రాల్లో ఏసీలు పనిచేయడం లేదు. ఓసీల్లో అధిక వేడికి యంత్రాలు సైతం అగ్నిప్రమాదాలకు గురవుతున్నారుు. దుమ్ము, ధూళితో ఊపిరి సలపని పరిస్థితి. దీంతో కార్మికుల హాజరు శాతం తగ్గి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల కారణంగా కార్మిక ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటోంది. పగటివేళ వడగాలుల తీవ్రత కారణంగా విధులకు వెళ్లడానికి కార్మికు లు జంకుతున్నారు. భూగర్భగనుల్లో రోజుకు మొదటి, రెండవ, నైట్ షిఫ్టుతోపాటు ప్రీషిఫ్టులు నడుస్తున్నారుు. మొదటిషిఫ్టు కార్మికులు ఉద యం 6 గంటలకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2 గంటలకు, నైట్‌షిఫ్ట్ రాత్రి 10 గంటలకు, ప్రీషిఫ్ట్ కార్మికులు ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం షిఫ్టు కార్మికులు విధులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండ, వడగాల్పు ల కారణంగా అలిసిపోరుు పనులు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నారుు.
ఓసీలపై తీవ్ర ప్రభావం
అసలే ఎండులు మండుతున్నారుు. ఓపెకాస్టు ల్లో బయటికన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అటు బొగ్గు వేడి, ఇటు వడగాలులు తట్టుకోలేని విధంగా ఉంటున్నారుు. పైగా యూజమాన్యం కల్పించిన ఉపశమన చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు. బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడే భారీ యంత్రాలు, వాహనాల్లో ఏసీలు సక్రమంగా పనిచేయడంలేదు. కొన్ని పాత యంత్రాల్లో పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో మధ్యాహ్నం షిఫ్టు కార్మికు లు విధులకు వెళ్లాలంటే ధైర్యం చేయలేక పోతున్నారు. కొందరు కార్మికులు అనారోగ్యాని కి గురవుతామనే భయంతో విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.
ఉత్పత్తిలో వెనుకబాటు
మే నెలలో ఓపెన్‌కాస్టు గనులు ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు 24.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూల్సి ఉండగా 23.3 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. భూగర్భగనుల్లో 12.2 లక్షల టన్నులకు 11.5 లక్షల టన్ను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో 19.26 లక్షల టన్నుల కు 18.50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ముఖ్యంగా ఒక ఓసీలో ఒక షిఫ్టునకు సుమారు 300 మంది కార్మికులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఈనెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల 20 నుంచి 30 మంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
45 రోజుల్లో 9లక్షల టన్నుల వెనుకబాటు
ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ ఒకటి నుంచి మే 15వ తేదీ వరకు కంపెనీ వ్యాప్తంగా 75లక్షల టన్నులకు 67 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. భూగర్భగనుల్లో 16 లక్షల టన్నులకు 13 లక్షల టన్నులు, ఓపెన్‌కాస్టుల్లో 50లక్షల టన్నులకు 54 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. మొత్తం 11 ఏరియాల్లో కేవలం 3 ఏరియాలు మాత్రమే ఇప్పటివరకు 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేయగలిగాయి.