42 డిగ్రీలకు చేరువలో కోల్‌బెల్ట్ ఉష్ణోగ్రతలు
ఎండ వేడి, వడగాలులతో కార్మికులు విలవిల
కార్మికుల హాజరు శాతంపై పడుతున్న ప్రభావం
మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : సింగరేణి బొగ్గుగనులు విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ఏరియూలో రోజురోజుకూ ఉష్ణోగ్రత లు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే రామగుం డం, కొత్తగూడెం రీజియన్లలో 41.5 డిగ్రీలు, బెల్లంపల్లి రీజియన్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 50 డిగ్రీ లు దాటే అవకాశమూ లేకపోలేదు. మొదటి షిఫ్టు విధులు ముగించుకొని వచ్చే కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి బయలు దేరుతారు. అదే సమయానికి రెండో షిఫ్టు డ్యూటీకి వెళ్లే కార్మికులు సైతం ఇంటి నుంచి బయలు దేరుతారు. ఈ సమయంలో కార్మికు లు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు విపరీతమైన ఎండ, వడ గాడ్పులతో విలవిల్లాడుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌కాస్ట్, భూగర్భగనుల్లో 58వేల మంది కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తున్నారు. రోజూ మొదటి, రెండు షిఫ్టు ల్లో 45వేల మంది వరకు హాజరవుతున్నారు.
తగ్గుతున్న హాజరు శాతం
బొగ్గు, దుమ్ము కారణంగా గనుల పరిసర ప్రాంతాలు సాధారణ స్థారుు కంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో అరుుతే వేడిమి మరింత అధికం. ఎండ వేడిని తట్టుకోలేక ఓసీల్లో కార్మికుల హాజరు శాతం కొంత మేరకు తగ్గుతోంది. ఉదయం పది గంటల వరకే 36 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రత మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.5 డిగ్రీల కు చేరుకుంటోంది. దీంతో కార్మికులు వేడిని తట్టుకోలేక సెలవులను వినియోగించుకోవ డానికి మొగ్గుచూపుతున్నారు.
నివారణ చర్యలు అంతంతే
ఓసీల్లో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడంలేదు. బొగ్గు పొరలు వేడెక్కకుండా ఉండేందుకు బొగ్గు బెంచీలను నీటితో నింపుతున్నారు. నీరు లభించని గనుల్లో బొగ్గు పొరలను మట్టితో కప్పి ఉంచుతున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల దారుల్లో స్ప్రింకర్ల ద్వారా నీటిని చల్లించి వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన ఫలితాలు లభించ డం లేదు. గతంలో కంటే ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో వేసవి ఉపశమన చర్యలు తక్షణమే అవసరం మేరకు చేపట్టాలి. లేని పక్షంలో కార్మికల హాజరు శాతంపై మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నారుు.
పర్యావరణంపై దృష్టిపెడితేనే ఫలితం
భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనులతోపాటు సింగరేణి కాలనీల్లో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను మరింత పెరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం మొక్కలను నాటింది. అరుుతే వాటి పరిరక్షణపై పూర్తి స్థారుులో దృష్టి సారించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. యూజమాన్యం 2002లో అటవీశాఖను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1872.5 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల నీలగిరి, వెదురు, కానుగ తదితర మొక్కలను నాటింది. ఏరియూల వారీగా కొత్తగూడెంలో 240, ఇల్లెందులో 115, మణుగూరులో 40, ఆర్‌జీ-1లో 502.50, ఆర్‌జీ-2లో 115, ఆర్‌జీ-3లో 95, భూపాలపల్లిలో 260, శ్రీరాంపూర్‌లో 215, బెల్లంపల్లిలో 205, మందమర్రిలో 85 ఎకరాల్లో మొక్కలు నాటారు. వీటిని పూర్తి స్థారుులో పరిరక్షించుకుంటే పర్యావరణాన్ని కాపాడుకోవడంతోపాటు అధిక వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.