ఆదిలోనే మందగించిన ఉత్పత్తి | The slowest production in the beginning | Sakshi
Sakshi News home page

ఆదిలోనే మందగించిన ఉత్పత్తి

Published Tue, May 2 2017 3:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

ఆదిలోనే మందగించిన ఉత్పత్తి - Sakshi

ఆదిలోనే మందగించిన ఉత్పత్తి

ఏప్రిల్‌లో ఆశించిన స్థాయిలో వెలికితీయని బొగ్గు
► ఆరు డివిజన్లలో లక్ష్యానికి దూరంగా...
► తొమ్మిది శాతంతో సరిపెట్టుకున్న అడ్రియాల


సింగరేణిలో 2017–18 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఆరంభంలోనే బొగ్గు ఉత్పత్తి మందగించింది. మొత్తం 11 డివిజన్లకు గాను ఐదు డివిజన్లలో మాత్రమే లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించగా.. మిగిలిన ఆరు డివిజన్లలో ఆశించిన  మేర బొగ్గును వెలికితీయలేకపోయారు. ఇందులో భూపాలపల్లి డివిజన్‌ 121 శాతంతో ముందుండగా..   అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు ఏరియాలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే బొగ్గును వెలికితీయడం గమనార్హం.

గోదావరిఖని: సింగరేణి సంస్థలో 2016–17 ఆర్థిక సం వత్సరంలో 66 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించగా... ఆపసోపాలు పడి 61 మిలి యన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. అంటే బొగ్గు ఉత్పత్తి వస్తుందనుకున్న పలు ప్రాజెక్టుల నుంచి ఆశించిన మేర బొగ్గును వెలికితీయకపోవడంతో ఈ ప్రభావం సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై పడింది. ఈ పరిణామాలను గుణపాఠాలుగా నేర్చుకుని 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ నెల నుంచే నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాల్సిన యంత్రాంగం వెలికితీసిన ఉత్పత్తిని పరిశీలిస్తే ఆ మేరకు శ్రమించినట్టు కనిపించడం లేదు.

ఐదు డివిజన్లలో లక్ష్యసాధన...
సింగరేణి పరిధిలోని భూపాలపల్లి డివిజన్‌ ఏప్రిల్‌ నెలలో 121 శాతం బొగ్గు ఉత్పత్తితో ముందు వరుసలో ఉంది. ఇక్కడ భూగర్భ గనులతో పాటు ఓసీపీలలో ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేయడంతో ఇది సాధ్యమైంది. భూపాలపల్లిలో రోజువారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7,244 టన్నులుగా నిర్ణయిస్తే...10,945 టన్నులను వెలికితీశారు. అంటే నెలవారీగా పరిశీలిస్తే 1,73,856 టన్నుల లక్ష్యానికి గాను 2,11,148 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. ఇక బెల్లంపల్లి డివిజన్‌లో 106 శాతం, మణుగూరు డివిజన్‌లో 105 శాతం, ఆర్జీ–3 డివిజన్‌లో 104 శాతం, ఆర్జీ–1 డివిజన్‌లో వందశాతం బొగ్గు ఉత్పత్తి చేయగలిగారు.

అడ్రియాలలో అత్యల్పంగా...
రామగుండం రీజియన్‌ పరిధిలో సుమారు రూ. 1200 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు నుంచి ఏప్రిల్‌ నెల ప్రారంభంలోనే ఆశించిన ఫలితాలు కానరాలేదు. అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు చరిత్రలోనే ఒక నెలలో కేవలం తొమ్మిది శాతం మేర మాత్రమే బొగ్గు ఉత్పత్తిని వెలికితీయడం గమనార్హం. ఈ గనిలో  రోజుకు 10,592 టన్నుల లక్ష్యం నిర్ణయించగా...కేవలం 1067 టన్నులు మాత్రమే వెలికితీశారు.

నెలవారీగా చూస్తే 2,54,208 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 21,920 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. అంటే ఈ గని కోసం పెట్టుబడి అధికంగా పెట్టినా...ఆశించిన ఫలితాలు రాకపోవడంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఇక కొత్తగూడెం డివిజన్‌లో 88శాతం, ఇల్లెందులో 43 శాతం, ఆర్జీ–2 డివిజన్‌లో 85శాతం, మందమర్రి డివిజన్‌లో 71 శాతం, శ్రీరాంపూర్‌ డివిజన్‌లో 88 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు.

బొగ్గు ఉత్పత్తిపై పాలనా ప్రభావం?
సింగరేణిలో మొత్తంగా వార్షిక సంవత్సరం ప్రా రంభ నెలలోనే 86శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం పై పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తా యా? అనే అంశం చర్చకు దారితీస్తోంది. ఓ వైపు సింగరేణి సంస్థ రథసారధి, సీఎండీ పదవిలో ఉన్న ఎన్‌.శ్రీధర్‌కు పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, కొత్త ప్రాజెక్టులు, వాటి తీరుతెన్నులపై పరిశీలన చేసే డైరెక్టర్‌ (ప్రాజెక్ట్సు, ప్లానింగ్‌) నెల రోజులుగా లేకపోవడం, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన రమేషకుమార్‌ ఏప్రిల్‌ నెలాఖరులో పదవీవిరమణ పొందడంతో సంస్థలో పర్యవేక్షణ లోపించిందని కార్మిక సంఘాలు వాదిస్తున్నా యి. మే నెలలోనైనా బొగ్గు ఉత్పత్తికి ప్రత్యక్ష సం బంధమున్న డైరెక్టర్‌ (పీపీ), డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) పదవులను ప్రభుత్వం భర్తీచేస్తేనే నిర్దేశిం చిన బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని సింగరేణియులు భావిస్తున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement