వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ ఇప్పుడు ఎక్కడున్నారు? రష్యాలోనే ఉన్నారా? లేక పొరుగు దేశం బెలారస్‌లో తల దాచుకుంటున్నారా? తిరుగుబాటు తర్వాత పుతిన్‌తో ఆయన సమావేశమై తన చర్యలపై వివరణ ఇచి్చనట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి.
అయితే, పుతిన్ ఆదేశాలతో రష్యా అధికారులు ప్రిగోజిన్‌ను ఇప్పటికే అంతం చేసి ఉండొచ్చని లేక జైల్లో బంధించి ఉండొచ్చని అమెరికా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పుతిన్‌తో ప్రిగోజిన్ భేటీ రష్యా ఆడిన డ్రామా అని ఆయన తేలి్చచెప్పారు. ప్రిగోజిన్‌ను ఇక బహిరంగంగా చూడటం అనుమానమేనన్నారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్‌ను రష్యా అధికారులు చంపేసి అయినా ఉండాలి లేదా జైల్లో పెట్టయినా ఉండాలి లేదా ఎక్కడైనా దాచేసి ఉండాలి అని రాబర్ట్ అబ్రామ్స్ వెల్లడించారు.
ప్రిగోజిన్ జూన్ 23న తన ప్రైవేట్ సైన్యంతో కలిసి పుతిన్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. కొందరు రష్యా సైనికాధికారుల అండతోనే ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు వాదనలు వినిపించాయి. తిరుగుబాటు కొన్ని గంటల్లోనే ముగిసింది. ఆ తర్వాత జూన్ 29న ప్రిగోజిన్ తన వాగ్నర్ గ్రూప్ కమాండర్లతో కలిసి పుతిన్‌తో సమావేశమయ్యారని, ఇకపై రష్యా ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామన్నట్టు వార్తలొచ్చాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రిగోజిన్ సేవల దృష్ట్యా అతడికి పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించినట్టు వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment