ప్రపంచమంతా ఏకతాటిపై నిలబడి యుద్దం వద్దన్నా లెక్కచేయక మంకుపట్టుతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్వింది. చిన్న దేశం అయినా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగితే ఇక అంతే అన్నారు అంతా. కానీ ఊహించని రీతిలో తనదైన వ్యూహంతో రష్యాకు చుక్కలు చూపించేలా ఉక్రెయిన్ సైన్యం యుద్ధం చేసింది. మమల్ని నిలవరించడం అసాధ్యం అని ఉక్రెయిన్ చెప్పకనే చెప్పింది రష్యాకి. ప్రతి ఉక్రెయిన్ పౌరుడు మాతృభూమి కోసం తమ చివరి రక్తపు బొట్టువరకు పోరాడి రక్షించుకుంటాం అని సగర్వంగా చెప్పి విస్మయపర్చింది. ఏడాదికిపైగా యుద్ధం జరగుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఇక రష్యాలో అంతకంతకు పెరిగిపోతున్న కోపం.. ఇక పంతం నెగ్గించుకునే వెర్రిలో ఎన్నో యుద్ధ నేరాలకు తెరతీసిందో చెప్పనవసరం లేదు. అయినా ఉక్రెయిన్‌ని నిలువరించలేక పోయింది. పైగా ఒకనొక సమయంలో సైన్యం వెనక్కి వెళ్లిపోయింది కూడా. ఇలా రసవత్తరంగా ఇరు దేశాల మధ్య యుద్ధం సాగుతున్న వేళ.. రష్యాకు ఊహించని రీతిలో షాక్ తలిలింది. ఉక్రెయిన్ యుద్ధంలోకి దింపిన కిరాయి సైన్యానికి చెందిన సంస్థ వాగ్నర్ గ్రూప్ గట్టి షాక్ ఇచ్చింది. రష్యా వెన్నులో బాకు దింపి తిరుగుబాటు జెండా ఎగరువేశారు వాగ్నర్ గ్రూప్ చీఫ్.
తాను పెంచి పోషించిన కిరాయి సైన్యమే తనపై కత్తి దూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పుతిన్. ఇది అమానుషం, వెన్నుపోటు, అన్యాయం అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ కిరాయి సైన్యమే కావడంతో రష్యాకు తలనొప్పి తప్పేలాలేదు. ఇప్పటికే రష్యా ఈ యుద్ధంలో వేలాది సైనికులను పోగొట్టుకుంది. పెద్ద సంఖ్యలో సైనిక మొబైలేజేషన్ పేరిటతో రిక్రూట్‌మెంట్ చేసుకుంది.
అలాగే ఈ కిరాయి సైన్యాన్ని కూడా దింపింది. ఒక పక్క ఆయుధాలు, సైనికుల కొరతతో సతమతమతున్న రష్యా గత్యంతరం లేక ఆ దేశ అధ్యక్షుడు పంతం నెరవేర్చడం కోసం వెనుతిరగలేక ఉక్రెయిన్‌తో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో వాగ్నర్ గ్రూప్ రష్యాలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవ్వడం పుండమీద కారం చల్లినట్టయింది. ఇదిలాఉంచితే.. రష్యాలో జరిగినట్లుగానే చరిత్రలో తిరుబాటు బాట పట్టి.. అధికారాన్ని చేజిక్కించుకున్న వాళ్లు ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం..
తిరుగుబాటు జెండా ఎగరువేసి వెన్నుపోటు పొడిచిన నాటి నాయకులు..
ముమ్మర్ గడ్డాఫీ:
పేద బెడౌయిన్ కుటుంబంలో జన్మించిన ముమ్మర్ గడ్డాఫీ లిబియ రాచరికం, దాని పాశ్చాత్య మద్దతుదారులను అసహ్యించుకుంటూ పెరిగాడు. సరిగ్గా ఆ రాచరికంలో పెరుగుతున్న బలహీనతను ఆసరాగా చేసుకుని అప్పటి జూనియర్ ఆర్మీ అధికారి కింగ్ ఇద్రిస్ దేశం వెలుపల ఉన్న సమయంలో తిరుగబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అతను 42 సంవత్సారాల పాటు లిబియాను పాలించాడు.
నెపోలియన్ బోనపార్టే
నెపోలియన్ కూడా ఆ బాటలోనే నడిచాడు. అతను 1799లో ఫ్రెంచ్ విప్లవ సమయంలో తిరుగుబాటు బాటపట్టి ప్రముఖంగా ఎదిగాడు. ఈ క్రమంలోనే 1804 వరకు రిపబ్లిక్ మొదటి కాన్సుల్ అయ్యాడు. ఆ తర్వాత 1815 వరకు ఫ్రాన్స్ చక్రవర్తిగా పాలించాడు.
ఫిడేల్ కాస్ట్రో
క్యూబా విప్లవకారుడు జనరల్ ఫుల్జెన్సియో బాటిస్టాకు వ్యతిరేకంగా జూలై 26న మొదలైన గెరిల్లా యుద్ధంలో.. ఉద్యమానికి నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 1959లో బాటిస్టాను పడగొట్టి.. క్యాస్ట్రో క్యూబా నాయకుడిగా అధికారాన్ని దక్కించుకున్నాడు.
ఫుల్జెన్సియో బాటిస్టా
క్యూబా అధ్యక్షుడిగా ఎన్నికై బాటిస్టా 1940 నుంచి 1944 వరకు పాలించాడు. అతను ప్రారంభంలో 1933 సార్జెంట్ల తిరుగుబాటులో భాగంగా అధికారంలోకి వచ్చాడు. అలాగే 1952 నుంచి 1959 వరకు క్యూబా విప్లవ సమయంలో ఓడిపోవడానికి ముందు యూఎస్ మద్దతు ఉన్న సైనిక నియంతగా కూడా పనిచేశాడు.
పోల్‌పాట్
1975లో, ఖైమర్ రూజ్ గెరిల్లాలు కంబోడియాలోని జనరల్ లోన్ నోల్ సైనిక ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ సమయంలో పోల్ పాట్ నేతృత్వంలో ఒక మిలియన్ మందికి పైగా ప్రజలను చంపే తీవ్రవాద పాలన ప్రారభమయ్యింది. పోల్‌పాల్ 1976 నుంచి 1979 మధ్య కాలం వరకు ప్రధానమంత్రిగా చేశాడు. ఆ తర్వాత 1997లో తనని నాయకుడిగా తొలగించేంత వరకు కంబోడియాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు.
వ్లాదిమిర్ లెనిన్
బోల్షెవిక్ పార్టీ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలో వామపక్ష విప్లవకారులు రష్యాలోని అసమర్థమైన తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించారు. అతను 1917 నుంచి 1924 వరకు సోవియట్ రష్యాకు, అలాగే 1922 నుంచి 1924 వరకు సోవియట్ యూనియన్‌కు మొదటి ప్రభుత్వ అధిపతిగా పనిచేశాడు.
ఫ్రాన్సిస్కో ఫ్రాంకో
ఫ్రాన్సిస్కో ఫ్రాంకో స్పానిష్ అంతర్యుద్ధం సమయంలో రెండవ స్పానిష్ రిపబ్లిక్‌ను పడగొట్టడంలో జాతీయవాద దళాలకు నాయకత్వం వహించిన స్పానిష్ జనరల్. ఆ తర్వాత అతను 1939 నుంచి 1975 వరకు స్పెయిన్‌ను నియంతగా పరిపాలించాడు.
కేథరీన్ ది గ్రేట్
కేథరీన్ ది గ్రేట్ 1762 నుంచి 1796 వరకు రష్యా చివరి ఎంప్రెస్ రెగ్నెంట్, అలాగే దేశంలో ఎక్కువ కాలం పాలించిన మహిళా నాయకురాలు. ఆమె భర్త పీటర్ III పదవీచ్యుతుడైన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది.
(చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్‌కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..)
Comments
Please login to add a commentAdd a comment