యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో రష్యా కష్టకాలంలో పడింది. ప్రిగోజిన్ అరెస్టును ఇప్పటికే ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అతన్ని దేశ ద్రోహిగా సంబోధించాడు. దీనిపై స్పందించిన ప్రిగోజిన్.. తాను నిజమైన దేశ భక్తుడనని చెప్పుకున్నారు. తన సైన్యం తిరుగుబాటుతోనే దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని చెప్పారు.
అయితే.. రష్యాలో మొదలైన ఈ అంతర్యుద్ధాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. చెడును కోరేవారు అందులో అంతమవుతారని అన్నారు. కాగా.. వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో ఇన్ని రోజులు ఉక్రెయిన్‌లో మోగిన బాంబుల మోతలు ఇక రష్యాలో వినిపిస్తున్నాయి.
Prigozhin went on to say that Wagner forces fought in Africa and Ukraine while the Russian military leadership embezzled ammunition, weapons, and money needed by forces on the ground for their own gain.
— The Kyiv Independent (@KyivIndependent) June 24, 2023
రష్యా సైన్యం వాగ్నర్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వాగ్నర్ సేన లక్ష‍్యంతో వోరోనెజ్ సమీపంలోని హైవేపై మిలిటరీ బాంబుల వర్షం కురిపించి. ఆ దృశ్యాలు స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించాయి.
The moment of the explosion on the highway near #Voronezh. https://t.co/Fp9RJR9rey pic.twitter.com/B1Ieuh9yF2
— NEXTA (@nexta_tv) June 24, 2023
ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపింది. కానీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. జిల్లా మిలిటరీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో స్థానిక ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.
There was an explosion near the headquarters of the Southern Military District in Rostov-on-Don - RT propaganda correspondent from the scene. pic.twitter.com/jNQdGkota0
— NEXTA (@nexta_tv) June 24, 2023
రోస్తోవ్ నగరాన్ని ఆక్రమించామని వాగ్నర్ సేన ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ పెద్ద ఆయిల్ స్థావరంపై దాడి జరిగింది. చమురు డిపోలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వీటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
An oil depot near #Voronezh is on fire, according to local media outlets. pic.twitter.com/itgHw2c5zc
— NEXTA (@nexta_tv) June 24, 2023
ఇదీ చదవండి: రష్యాలో సైన్యంపై పుతిన్ సన్నిహితుడి తిరుగుబాటు.. పాతిక వేలమంది చావడానికి రెడీ!
Comments
Please login to add a commentAdd a comment