సాక్షి, కడప : కడప జిల్లా రాజంపేటకు చెందిన గిరిప్రసాద్ కాస కువైట్ కేంద్రంగా ‘గల్ఫ్ బాబాయి’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గల్ఫ్ సమస్యలపై తెలుగులో విషయాత్మక లఘు చిత్రాలు ప్రసారం చేస్తూ ప్రవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిప్రసాద్ 20 ఏళ్లుగా కువైట్‌లో ఓ మీడియా కంపెనీలో ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గల్ఫ్ జీవితాల పట్ల ఉన్న అవగాహనతో నాలుగేళ్ల క్రితం ‘గల్ఫ్ బాబాయి’ యూట్యూబ్ ఛానల్‌ను స్థాపించారు. కువైట్‌లోని 20 మంది తెలుగువారితో ఒక టీమ్ ఏర్పాటు చేసి వారినే ఆర్టిస్టులుగా చేసి అవగాహన, సందేశాత్మక, వినోదాత్మక షార్ట్ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 18 నిమిషాల నిడివిగల ‘సారాయి’ షార్ట్ ఫిల్మ్ నిజ జీవితాన్ని ఆవిష్కరించింది.
గిరిప్రసాద్ కాస కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించిన ఈ ష్టార్ట్ మూవీ ‘గల్ఫ్‌బాబాయ్’ యూట్యూబ్‌ఛానల్‌లో ఉంది.https://www.youtube.com/ watch? v=63U5Ek_l9tM_ feature=youtu.be లింక్‌పై క్లిక్ చేసి ఈ మూవీని చూడవచ్చు. గల్ఫ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. గతంలో విడుదల చేసిన చీటి పాటల మోసం, గల్ఫ్‌లో కొత్త కుర్రోడు లాంటి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌లను కూడా ఈ ఛానల్‌లో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment