
'అధిష్టానం నిర్ణయం శిరసా వహిస్తా'
తిరుపతి : ప్రజాతీర్పు శిరోధార్యమని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆమె గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానన్నారు. రాజంపేటలో తనకు సహకరించిన బీజేపీ, టీడీపీ శ్రేణులకు పురంధేశ్వరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి వైఎస్ఆర్ జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు.