మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ సీనియర్ నేత సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్ వెల్లడించారు.