రాజంపేట: రైల్వే బడ్జెట్‌లో దశాబ్దాలుగా జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. ప్రతి ఏడాది జిల్లా నేతలు సరైన సమయంలో ఒత్తిడి పెంచకపోవడం, ప్రతిపాదనల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నష్ట వాటిల్లుతోంది. మరోసారి ఆ సమయం ఆసన్నమైంది. 2015-2016 బడ్జెట్ రైలును పట్టాలపైకి తీసుకురావడానికి రైల్వేమంత్రిత్వశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ దశలోనే మన నేతలు స్పందించాలి. ఆయా ప్రాంతాల పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధుల పరిధిలో నెలకొన్న డిమాండ్లపై లేఖలు పంపాలని రైల్వేశాఖ కోరింది. జిల్లా అవసరాలు నెరవేరేలా ప్రతిపాదనలు చేసి వాటికి బడ్జెట్‌లో చోటు దక్కేలా చేసుకోవాల్సింది. ఈ స్థితిలో జిల్లాలో రైల్వే పరంగా ఉన్న అవసరాలను ఒకసారి పరిశీలిస్తే....
డిమాండ్‌లో ఉన్న రైళ్లు ఇవే..
తిరుపతి-షిర్టి మధ్య రైలును జిల్లా మీదుగా నడిపించాలని ప్రతిపాదన అలాగే ఉంది. గతంలో ఉన్న ఇదే రైలును అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమారరెడ్డి సర్కారు హయాంలో అనంతరం జిల్లా మీదుగా మార్చుకున్నారు. షిర్డికి వెళ్లాలంటే గుంతకల్‌కు వెళ్లి ఎక్కాల్సిన పరిస్ధితి జిల్లా వాసులకు పట్టింది. తిరుపతి-మచిలీపట్నం రైలు కడప వరకు పొడిగింపు ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఈరైలు రాకతో జిల్లా వాసులకు కొత్తరాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు వీలవతుంది.
ఎర్రగుంట్ల-నొస్సం మధ్య నడిచే రైలు బడ్జెట్‌కే పరిమితమవుతోంది. ఈ రైలు నిర్వహణ పరంగా నందలూరు-నొస్సం మధ్య నడిపించే అంశాన్ని రైల్వే పరిశీలించాలని రైల్వేనిపుణులు కోరుతున్నారు. ఈ రైలును రెండేళ్ల కిందట బడ్జెట్‌లో ప్రకటించారు. ఇంతవరకు ఆ రైలు పట్టాలెక్కలేదు.
ఎపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు జిల్లాలో కీలకమైన రైల్వేకేంద్రాల్లో స్టాపింగ్ ఇవ్వాలని చాలకాలంగా కోరుతున్నప్పటికీ రైల్వేశాఖ స్పందించే పరిస్ధితులు కనిపించడంలేదు.
కర్నూలు వరకు నడస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును కడప, నందలూరు వరకు పొడిగించాలనే చిరకాల ప్రతిపాదనను ఆటకెక్కించారు.
రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరులో అన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే ఉద్యోగులు, సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని స్టాపింగ్స్ ఇవ్వాలనే డిమాండ్ రైల్వేకార్మికసంఘాలతో పాటు..ప్రజాప్రతినిధుల డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానడిమాండ్లు ఇవే..
నంద్యాల-ఎర్రగుంట్ల లైన్ ఇంకా 31 కిలోమీటర్లు నిర్మితం కావాల్సి ఉంది.నొస్పం వరకు ట్రాక్ వేశారు. 128 కిమీ ఉన్న ంద్యాల-ఎర్రగుంట్ల రైలుమార్గానికి రూ843.45కోట్ల అంచనా వ్యయాన్ని వేశారు. ఇప్పటి వరకు రూ753.44 కోట్లు ఖర్చు చేశారు.
కడప-బెంగళూరు రైలు మార్గానికి రూ. 1343 కోట్లతో అంచనా వేశారు. గత బడ్జెట్‌లో రూ.30కోట్లు మాత్రమే కేటాయించారు. పెండ్లిమర్రి వరకు ఎర్త్ వర్క్ పనులు జరిగాయి.
కంభం-ప్రొద్దుటూరు, భాకరపేట-గిద్దలూరు రైల్వేలైను సర్వేకే పరిమితమయ్యాయి.
నందలూరు రైల్వేస్టీమ్ ఇంజన్ లోకోషెడ్‌లో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగులుతోంది. ఇటీవల సోలార్ విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. అయితే ఇది కాకుండా రైల్వేపరమైన పరిశ్రమ కావాలని డిమాండ్ ఎన్‌డీఏ ప్రభుత్వపెద్దల వద్దకు తీసుకెళ్లారు.
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలుమార్గంలో ఎర్త్ పనులు పూర్తి అయినప్పటికీ టన్నెల్ పనులు మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు. దీంతో ఈ మార్గ నిర్మాణం పూర్తికావడానికి జాప్యం జరుగుతోంది.
ఫిబ్రవరిలో రైల్వే బడ్జెట్ -రైల్వేమంత్రిత్వశాఖ కసర త్తు, మీ ప్రాంతంలో రైల్వే డిమాండ్ల వివరాలు ఇవ్వాలంటూ ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిదులకు లేఖలు వ్రాశారు. బడ్జెట్ కేటాయింపులో ద.మరైల్వే లేఖలాఉ కొత్తరైఉ్ల,మార్గాలు, సర్వేలు. ప్రాజెక్టులు
పట్టాలెక్కేనా..!
Published Thu, Dec 4 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement