ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. ఇది.. ప్రభుత్వ పెద్దల మాట. కాన్పు కేసా.. రిమ్స్‌కెళ్లండి ఇది.. ఆయా ఆసుపత్రులలోని సిబ్బంది మాట.
ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. ఇది.. ప్రభుత్వ పెద్దల మాట. కాన్పు కేసా.. రిమ్స్‌కెళ్లండి ఇది.. ఆయా ఆసుపత్రులలోని సిబ్బంది మాట. వైద్యుల నిర్లక్ష్యంతో అనేక సందర్భాలలో మార్గమధ్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల తదితర ఆసుపత్రుల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
రాజంపేట, న్యూస్‌లైన్: కాన్పు కోసం రాజంపేట వైద్యవిధాన పరిషత్ ప్రభుత్వాస్పత్రి కి వస్తే.. రిమ్స్ కు రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇక రాత్రు ల్లో కాన్పు కేసులు వస్తే మరోమాట లేకుండా రిమ్స్ కు తరలిస్తున్నారు.
పైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేదలు విధిలేని పరిస్థితిలో రిమ్స్‌కు వెళుతున్నారు. ఈ నెల వరకు సీమాంక్ నుంచి 25 రెఫర్లు జరిగాయి. నెలకు 5 నుంచి 6 సీజేరియన్ కేసులు నమోదు అవుతున్నాయి. సీమా ంక్‌లో సేవలందించేందుకు ఒక వైద్యుడు ఉండగా, ఇద్దరు వైద్యురాలు ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ప్రభుత్వాస్పత్రిలో గర్భిణీ మూడో నెల నుంచి చూపించుకునే వారికి (బుక్‌డ్) ప్రసవానికి వస్తే చికిత్స అందిస్తున్నారు..అలా కాకుండా ఎక్కడో చూపించుకొని (అన్‌బుక్‌డ్) డెలివరీకి సీమాంక్‌కు వస్తే వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు.