టీడీపీ తీర్థం పుచ్చుకున్న సాయి ప్రతాప్ | Ex Congress MP Sai Prathap joins TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ తీర్థం పుచ్చుకున్న సాయి ప్రతాప్

Published Thu, Mar 24 2016 10:17 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

టీడీపీ తీర్థం పుచ్చుకున్న సాయి ప్రతాప్ - Sakshi

టీడీపీ తీర్థం పుచ్చుకున్న సాయి ప్రతాప్

హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి ఎ. సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు. గురువారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఫాంహౌస్ లో ఆయన సమక్షంలో సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు. ఆయన్ని టీడీపీలోకి పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. యూపీఏ హయాంలో సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా సాయి ప్రతాప్ విజయం సాధించారు. అయితే గతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.మిథున్ రెడ్డి చేతిలో సాయి ప్రతాప్ ఓటమి పాలైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement