రాజంపేట : తెల్లవారుజామున పెద్ద శబ్దం రావడంతో చుట్వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో భారీ పేలుడు సంభవించింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భార్యా భర్తలు మృతి చెందారు. టు ప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై వుండచ్చొని పోలీసులు భావిస్తున్నా, ఇంట్లో వున్న రెండు గ్యాస్ సిలెండర్లు.. సురక్షితంగా వుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ముగ్గురు పనివారు ఉండగా ఘటన జరిగిన గదిలో రెండు మృతదేహాలు పడివున్నాయి. మరో అతను మేడమీద ఉన్నట్లు తెలిసింది. కాగా అతనికి ఏమీ కాలేదు. వివరాలు ఇచ్చేందుకు మదన్ మోహన్ రెడ్డి అందుబాటులో లేరు. పేలుడు ధాటికి గది గోడలు బద్దలయ్యాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.