
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీ నేతకు చెందిన బార్‌లో కల్తీ మద్యం విక్రయం జోరుగా సాగుతుంది. రాజంపేటలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ పాచి, గడ్డి ఉన్న మద్యాన్ని విక్రయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం తిరుమల బార్‌లో బీర్ బాటిళ్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు.. వాటిలో పెద్ద ఎత్తున పాచి, గడ్డి దర్శనం ఇచ్చాయి. దీనిపై వినియోగదారులు బార్ ఓనర్ పులిరాజును ప్రశ్నించారు. అయితే ఓనర్ మాత్రం ఈ మద్యం తాము అమ్మలేదని.. వినియోగదారులపై దుర్భాశలు ఆడారు.
కల్తీ మద్యం విక్రయంపై వినియోగదారులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, అర్బన్ సీఐ శుభకుమార్, ప్రొహిబిషన్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులు మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment