duplicate liquor
-
టీడీపీ నేత బార్లో కల్తీ మద్యం!
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీ నేతకు చెందిన బార్లో కల్తీ మద్యం విక్రయం జోరుగా సాగుతుంది. రాజంపేటలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ పాచి, గడ్డి ఉన్న మద్యాన్ని విక్రయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం తిరుమల బార్లో బీర్ బాటిళ్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు.. వాటిలో పెద్ద ఎత్తున పాచి, గడ్డి దర్శనం ఇచ్చాయి. దీనిపై వినియోగదారులు బార్ ఓనర్ పులిరాజును ప్రశ్నించారు. అయితే ఓనర్ మాత్రం ఈ మద్యం తాము అమ్మలేదని.. వినియోగదారులపై దుర్భాశలు ఆడారు. కల్తీ మద్యం విక్రయంపై వినియోగదారులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, అర్బన్ సీఐ శుభకుమార్, ప్రొహిబిషన్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులు మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లభించింది. -
కర్నూలు జెడ్పీ ఛైర్మన్‌పై అక్రమ మద్యం కేసు
కర్నూలు : కర్నూలు జెడ్పీ ఛైర్మన్ రాజశేఖర గౌడ్‌పై అక్రమ మద్యం కేసు నమెదు అయ్యింది. నవంబర్ 2న ప్యాపిలి మండలం కొత్తపేట సమీపంలో రూ.11 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ అక్రమ మద్యం.. రాజశేఖర గౌడ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. జెడ్పీ ఛైర్మన్‌తో పాటు తిరుపాల్, రామన్నగౌడ్, డోన్ ఎంపీపీ కుమారుడు రామన్న గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. A1 ముద్దాయిగా ప్యాపిలికి చెందిన తిరుపాల్, A2 ముద్దాయిగా ఎంపీపీ కుమారుడు రామన్న గౌడ్, A3 ముద్దాయిగా టీడీపీ నేత ఉమామహేశ్వర్ గౌడ్, A4 ముద్దాయిగా జిల్లా జెడ్పీ ఛైర్మన్ పీఏ రాజశేఖర్, A5 ముద్దాయిగా జెడ్పీ ఛైర్మన్ రాజశేఖర గౌడ్‌పై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసు నుంచి జెడ్పీ ఛైర్మన్‌ను తప్పించటానికి రాజకీయ ఎత్తుగడలు ప్రారంభమయ్యాయి.