కర్నూలు జెడ్పీ ఛైర్మన్పై అక్రమ మద్యం కేసు | Excise police case filed against Kurnool ZP chairman over duplicate liquor | Sakshi
Sakshi News home page

కర్నూలు జెడ్పీ ఛైర్మన్పై అక్రమ మద్యం కేసు

Published Wed, Nov 12 2014 10:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

Excise police case filed against Kurnool ZP chairman over duplicate liquor

కర్నూలు : కర్నూలు జెడ్పీ ఛైర్మన్ రాజశేఖర గౌడ్పై అక్రమ మద్యం కేసు నమెదు అయ్యింది. నవంబర్ 2న ప్యాపిలి మండలం కొత్తపేట సమీపంలో రూ.11 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ అక్రమ మద్యం.. రాజశేఖర గౌడ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. జెడ్పీ ఛైర్మన్తో పాటు తిరుపాల్, రామన్నగౌడ్, డోన్ ఎంపీపీ కుమారుడు రామన్న గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

A1 ముద్దాయిగా ప్యాపిలికి చెందిన తిరుపాల్,  A2 ముద్దాయిగా ఎంపీపీ కుమారుడు రామన్న గౌడ్, A3 ముద్దాయిగా టీడీపీ నేత ఉమామహేశ్వర్ గౌడ్, A4 ముద్దాయిగా జిల్లా జెడ్పీ ఛైర్మన్ పీఏ రాజశేఖర్, A5 ముద్దాయిగా జెడ్పీ ఛైర్మన్ రాజశేఖర గౌడ్పై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసు నుంచి జెడ్పీ ఛైర్మన్ను తప్పించటానికి రాజకీయ ఎత్తుగడలు ప్రారంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement