కేక్ కట్ చేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి
కేవీపల్లె : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను కేవీపల్లెలో ముందస్తుగా నిర్వహించారు. శనివారం జెడ్పీటీసీ సభ్యురాలు గజ్జెల శృతి ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్‌కు తినిపించారు. పీలేరు నియోజకవర్గం నుంచే గాక, రాయచోటి, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు మిథున్‌రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఏపీఎండీసీ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు హరీష్‌రెడ్డి, కారపాకుల భాస్కర్‌నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ కడప గిరిధర్‌రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ గజ్జెల శృతి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, పి. ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, జయరామచంద్రయ్య, రామ్‌ప్రసాద్‌నాయుడు, సి.కె. యర్రమరెడ్డి, సిరి, సైఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment