కడప జిల్లా రాజంపేట సమీపంలో గురువారం ఉదయం వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోని ఓ బోగీ నుంచి ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు వెంటనే ట్రైన్ చైయిన్ లాగీ నిలిపివేశారు. కొంతమంది ప్రయాణికులు భయంతో ట్రైన్ వదిలి పరుగులు తీశారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బోగీలో పొగలు వ్యాపించడానికి గల కారణాలపై కనుగొన్నారు.
బ్రేక్ స్ట్రక్ అవడంతోనే పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 15 నిముషాల అనంతరం ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరింది. వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలు కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది.