20 నిమిషాలు నిలిచిపోయిన రైలు
రాజంపేట: తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం రాత్రి ఎస్–11 బోగి వద్ద పొగలు రావడంతో రైలు 20 నిమిషాలు నిలిచిపోయింది. రాత్రి 8.50 నిమిషాలకు రైలు వైఎస్సార్ జిల్లా రాజంపేట స్టేషన్ హోం సిగ్నల్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఎస్–11 బోగీ బ్రేక్ బైండింగ్ పట్టుకుపోయింది. దీంతో కొద్దిపాటి మంటలు, పొగలు వచ్చాయి. రాజంపేట రైల్వేస్టేషన్ హోం సిగ్నల్ వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. బోగీ కింద పొగలు, మంటలను చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే చైన్ లాగడంతో డ్రైవర్ రైలును ఆపారు. ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు బోగి వద్దకు వచ్చిన గార్డుతో వాదులాటకు దిగారు.
వాకీటాకీ లాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గార్డు బ్రేక్‌ను సరిచేయడంతో ప్రయాణికులు శాంతించి, వాకీటాకీని తిరిగి ఇచ్చారు. రైలు 9.10 నిమిషాలకు బయలుదేరింది. బ్రేక్ బైండింగ్ పట్టుకుపోవడం సహజమేనని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందిలేదని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైలు లూప్‌లైన్‌లోకి వెళ్లేటప్పుడు డ్రైవర్ బ్రేక్ వేసిన సమయంలో బ్రేక్ బైండింగ్‌లో స్పార్క్ వస్తుందని తెలిపారు. కాగా తరచుగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
Published Tue, May 23 2017 3:58 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
Advertisement
Advertisement