
ఆకేపాటి, మేడాను గజమాలతో సత్కరిస్తున్న ఎస్‌ఎర్రబల్లి వాసులు
సాక్షి,రాజంపేట: ‘‘రెండు నెలలు ఓపికపట్టండి.. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’’అంటూ వైఎస్సార్‌సీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి రాజంపేట రూరల్ ఏరియాలోని ఎస్.ఎర్రబల్లి సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ జెండా రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి ఎగురవేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్ పాలన అన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా సంక్షేమపాలన ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం ఎర్రబల్లికి చెందిన 35 కుటుంబాల వారికి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనరు పోలా శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాఎల్లారెడ్డి, సీనియర్ నాయకుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, మండల కన్వీనరు భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment