
మధ్యాహ్నం పీలేరులో సభ, రాత్రికి విజయవాడలో రోడ్‌షో
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన మధ్యాహ్నం 1:50 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.55 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.45 గంటలకు రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న కలికిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.
సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడ బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద 7 గంటలకు రోడ్ షోను ప్రారంభించి, గంట పాటు బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.