రాజంపేట : ఆహారం వికటించి 15 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 300 మంది బాలికలు ఉండే ఈ వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం తిన్న ఆహారంతో రాత్రి కొందరికి వాంతులు, విరేచనలు మొదలయ్యాయి. వారిని రాజంపేటలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, గురువారం ఉదయం వరకు కూడా తమను చూసేందుకు వైద్యులు రాలేదని బాలికలు చెబుతున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కలుషితాహారంతో బాలికలకు అస్వస్థత
Published Thu, Aug 27 2015 9:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement
Advertisement