వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి తర్వాత విద్యార్థులంతా వాంతులతో బాధపడుతుండటంతో హుటాహుటిన అందరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో రాత్రి పెట్టిన పెరుగన్నం కలుషితం కావటమే కారణమని వైద్యులు తెలిపారు.