రూ.5 కోట్లతో తాగునీటి బోర్ల డ్రిల్లింగ్
మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లను డ్రిల్లింగ్ చేయనున్నట్లు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో తన నిధుల నుంచి రూ.5 కోట్లను బోర్ల డ్రిల్లిం గ్‌కు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 7 నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్న 400 గ్రామాలను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డ్రిల్లిం గ్ చేస్తున్నట్లు వివరిం చారు.
శాశ్వత పరిష్కారానికి అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలి పారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా మంచినీళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని, అయితే టీడీపీ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు. కొంతవరకైనా సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో నిధులను అధికంగా మంజూరు చేశానన్నారు. హంద్రీ- నీవా జలాశయంతోనైనా సమస్య శాశ్వత పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.