
కండక్టర్ మాధవి
రాజంపేట: రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ రాజంపేట డిపోలో పనిచేస్తున్న సీ.మాధవి అనే కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. శనివారం తిరుపతి–రాజంపేట బస్సు సర్వీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి రాజంపేటకు వస్తుండగా కరకంబాడి వద్ద గూడూరుకు చెందిన పీ.శివప్రసాద్ రైల్వేకోడూరులో బస్సు ఎక్కారు. బస్సు దిగేటప్పుడు తన బ్యాగును మరిచిపోయారు.అందులో రూ.5లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి.
టికెట్స్ కొట్టేందుకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న బ్యాగ్‌ను కండక్టర్ గుర్తించింది ప్రయాణికులను విచారించింది. ఈలోగా బ్యాగును పొగొట్టుకున్న బాధితుడు రైల్వేకోడూరు కంట్రోల్ పాయింట్‌లో ఫిర్యాదు చేశారు. టికెట్‌ను బట్టి కండక్టరుకు ఫోన్ చేస్తే, డిపో వద్దకు వస్తే బ్యాగు ఇస్తామని తెలిపారు. బ్యాగ్‌ను డిపో మేనేజరు రమణయ్యకు అందచేశారు. డీఎం చేతులమీదుగా శివప్రసాద్‌కు కండక్టర్ అప్పగించారు. మాధవిని ఎన్‌ఎంయూ డిపో అధ్యక్షుడు శివయ్య, సెక్రటరీ రమణ, ఆన్ డ్యూటీ కంట్రోల్ చలపతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment