Female conductor
-
మద్యం మత్తులో మహిళా కండక్టర్‌పై దాడి
జరుగుమల్లి (సింగరాయకొండ): మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో శుక్రవారం జరిగింది. కామేపల్లికి చెందిన ప్రత్తిపాటి హరిబాబు మద్యం తాగి గ్రామంలోని షాపుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరు రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు గద్దించడంతో అటుగా వస్తున్న టంగుటూరు–కామేపల్లి ఆర్టీసీ బస్సు ఎదుట అడ్డంగా పడుకున్నాడు. కండక్టర్ సుభాష్ ని సెల్ఫోన్లో వీడియో తీసేందుకు ప్రయతి్నంచగా ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. సుధారాణి కిందపడిపోగా ఆమె ఛాతీపై తన్నాడు.అనంతరం తన చేతికి చిన్న గాయమైందని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హరిబాబు ఆయా డ్రస్సింగ్ చేస్తుండగా డాక్టర్ ఎక్కడ అని కేకలేస్తూ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు, ఫరి్నచర్ ధ్వంసం చేశాడు. డాక్టర్ రేష్మి ఫిర్యాదు మేరకు జరుగుమల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. కండక్టర్ సుహాసినిని ప్రథమ చికిత్స అనంతరం కందుకూరు ఏరియా ఆస్పత్రికిపంపించారు. -
మహిళా కండక్టర్ నిజాయితీ
రాజంపేట: రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ రాజంపేట డిపోలో పనిచేస్తున్న సీ.మాధవి అనే కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. శనివారం తిరుపతి–రాజంపేట బస్సు సర్వీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి రాజంపేటకు వస్తుండగా కరకంబాడి వద్ద గూడూరుకు చెందిన పీ.శివప్రసాద్ రైల్వేకోడూరులో బస్సు ఎక్కారు. బస్సు దిగేటప్పుడు తన బ్యాగును మరిచిపోయారు.అందులో రూ.5లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. టికెట్స్ కొట్టేందుకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న బ్యాగ్‌ను కండక్టర్ గుర్తించింది ప్రయాణికులను విచారించింది. ఈలోగా బ్యాగును పొగొట్టుకున్న బాధితుడు రైల్వేకోడూరు కంట్రోల్ పాయింట్లో ఫిర్యాదు చేశారు. టికెట్‌ను బట్టి కండక్టరుకు ఫోన్ చేస్తే, డిపో వద్దకు వస్తే బ్యాగు ఇస్తామని తెలిపారు. బ్యాగ్‌ను డిపో మేనేజరు రమణయ్యకు అందచేశారు. డీఎం చేతులమీదుగా శివప్రసాద్‌కు కండక్టర్ అప్పగించారు. మాధవిని ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు శివయ్య, సెక్రటరీ రమణ, ఆన్ డ్యూటీ కంట్రోల్ చలపతి అభినందించారు. -
బెంగళూరులో మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి
బనశంకరి : బెంగళూరులో ఓ మహిళా కండక్టర్ పై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాగలగుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే...హవనూరు లేఅవుట్లో నివాసముంటున్న ఇందిరాబాయి పీణ్యా 9వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 5.45 గంటలకు ఇంటి నుంచి డిపోకి నడిచి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ చల్లి పరారయ్యారు. దాడిలో ఆమె ముఖం, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందిరాబాయి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాగలగుంటె పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఉద్రిక్తతల మధ్య కండక్టర్ అంతిమయాత్ర
ఆత్మకూరు: ఆర్టీసీ కండక్టర్ ఏరుకొండ రవీందర్ అంతిమయాత్ర ఆదివారం ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కండక్టర్ ఏరుకొండ రవీందర్ (52) గురువారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హన్మకొండకు తరలించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివా రం అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఉద యమే పెద్ద ఎత్తున ఆత్మకూరుకు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఊరుకునేది లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులను పలుమార్లు అదుపులోకి తీసుకుని వదిలేశారు. కాగా, రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వెళుతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కార్మికులు ఘెరావ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మృతుడు రవీందర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఎక్స్ గ్రేషియా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ ఆస్తులపై కన్ను పడిందని, కావాలనే కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిని ఫాలో కాకున్నా.. నిజాంను ఫాలో కావాలన్నారు. నిజాం హయాంలో ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉందని గుర్తుచేశారు. మహిళా కండక్టర్‌పై చేయిచేసుకున్న సీఐ కండక్టర్ రవీందర్ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో వీఆర్‌లో ఉన్న సీఐ మధు మహిళా కండక్టర్ భవానీపై చేయిచేసుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మళ్లీ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కార్మికులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో భవాని రోడ్డుపై పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సీఐ మధు తమకు క్షమాపణ చెప్పే వరకూ కదిలేది లేదని కార్మికులు భీష్మించారు. దీంతో డీసీపీ నాగరాజు, ఏసీపీ శ్రీనివాస్ కార్మికులతో మాట్లా డి శాంతింపచేశారు. సీఐపై చర్య తీసుకుంటా మనడంతో వారు ఆందోళన విరమించారు. -
ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు అష్టకష్టాలు
పాతగుంటూరు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో..ఉద్యోగులకు విధుల నిర్వహణ అంతే కష్టం. అందులో మహిళా కండక్టర్ల పరిస్ధితి మరీ దారుణం. పేరుకు కండక్టర్ ఉద్యోగం, చెప్పుకోవడానికి ప్రయాణం చేస్తూ సాఫీగా సాగుతుందనుకుంటారు. కానీ అంత సులువేమీ కాదు. తెల్లారేసరికి ఇంట్లో పనులు చూసుకుని, పిల్లలను స్కూలుకు సిద్ధం చేసి విధులకు గంట ముందుగానే బస్టాండ్‌కు చేరుకోవాలి. గతుకుల దారిలో వేగంగా వెళుతున్న బస్సులో టిక్కెట్లు ఇవ్వాలి. ఓ వైపు ప్రయాణికుల కస్సు బుస్సులు..ఆకతాయిల వెకిలి చేష్టలు..మరో వైపు అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడిలోనూ రైట్..రైట్ అంటూ విజయవంతంగా రాణిస్తున్నారు. విధి నిర్వహణలో చికాకు, కోపాన్ని అణచివేస్తూ..ఎదురయ్యే సమస్యలు, కష్టాలను అధిగమిస్తూ టికెట్లు కొడుతూ ..విజిల్ వేస్తూ కష్టమైన జీవితాన్ని గడుపుతున్న మహిళా కండక్టర్లపై సాక్షి ప్రత్యేక కధనం... కండక్టర్ విధులంటే ఆషామాషీ కాదు. ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు కదలగానే టిక్కెట్ ఇవ్వాలి. స్టేజి ఉన్నా, లేకపోయినా ప్రయాణికులు చెయ్యేత్తిన చోట ఆపాలి. కోరిన చోట దించాలి. ప్రయాణికులను లెక్కించుకుని స్టాటికల్ రిపోర్టు(ఎస్ఆర్)రాయాలి. చెప్పడానికి ఇది సులువుగా వున్నా, చేయడానికి ఎంతో కష్టం. పురుషులే ఈ డ్యూటీలు చేయలేక చికాకు పడుతున్న సందర్భాలుంటాయి. కానీ మహిళలు వారితో సమానంగా సత్తా చాటుతున్నారు. 1997 కంటే ముందు పురుషులు మాత్రమే కండక్టర్లుగా విధులు నిర్వహించారు. మహిళా కండక్టర్లు ప్రారంభంలో రోజుకు రూ.65 చొప్పున పని చేసిన రోజులకు జీతం ఇచ్చేవారు. జిల్లాలోని 13 డిపోల్లో 584 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. గుంటూరు 1డిపోలో 78 మంది,2 డిపోలో 54, రేపల్లె 36, తెనాలి 67,మంగళగిరి 28, పొన్నూరు 39, బాపట్ల 30, నర్సరావేపేట 45, మాచర్ల 46, చిలుకలూరిపేట 39, సత్తెనపల్లి 28 మంది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. విధుల్లో ఇబ్బందులు... విధుల్లో మహిళా కండక్టర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చెప్పిన డ్యూటీలు చేయకపోతే వేధింపులకు గురికావాల్సిందేననే విమర్శలు వినిపిస్తున్నాయి. డిపోలలో మౌలిక వసతులు సక్రమంగా లేకపోయినా తప్పని పరిస్ధితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనా అడిగినా, ఓ చిన్న తప్పు దొరికినా మూడు నెలల పాటు ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నట్లు సమాచారం. డ్యూటీ సమయానికి నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు వేస్తారు. అంతేకాక డిపో స్పేరులో పెట్టడం, సస్పెండ్ చేయడం చేస్తుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బస్సుల సంఖ్య తగ్గడంతో బస్సులలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల (8 గంటల ప్రకారం) వరకు డ్యూటీ చేయిస్తున్నట్లు తెలిసింది. డిమాండ్లు... .మహిళా కండక్టర్లకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు పూర్తయ్యే డ్యూటీలు వేయాలి..ప్రతి డిపోలోనూ విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి.డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాల వసతులు కల్పించాలి..ప్రత్యేకంగా నెలకు మూడు రోజుల సెలవులు ఇవ్వాలి.అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు అరికట్టాలి.అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వాలి.22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. సెలవులు లేవు అవసరానికి తగినట్లుగా సెలవులు ఉండటంలేదు. అందరితో పాటే విధులకు హాజరుకాలి. ఉదయం 6 గంటల నుంచి మహిళలకు పని వేళలు మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం 4 గంటలకు మహిళలు డ్యూటీకి రావాలంటే ఇబ్బందిగా ఉంది. లక్ష్మీ,పొన్నూరు డిపో మహిళల సమస్యలను పరిష్కరించండి జిల్లాలోని 13 డిపోలలో మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. మూడురోజులు సెలవుపై డిపో మేనేజర్లను ఆదేశించారు. సెలవు ఇవ్వకపోతే తనకు ఫోన్లో చెప్పాలి. గుంటూరు ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి ప్రమోషన్లు లేవు 21 సంవత్సరాలుగా కండక్టరుగా విధులు నిర్వహిస్తున్నా. సర్వీసు ప్రకారం ప్రమోషన్లు లేవు. డ్యూటీ సమయంలో పలు ఇబ్బందులు తప్పడంలేదు. రద్దీ పెరిగినపుడు చిల్లర సమస్య తలెత్తుతోంది. కాశమ్మ, కండక్టర్, తెనాలి డిపో -
కండక్టరమ్మ..!
అమ్మగా లాలిస్తూ.. కండక్టర్‌గా టికెట్లు ఇస్తూ.. సాక్షి, సంగారెడ్డి: ‘‘ఎనిమిది నెలల పాపను భుజాన వేసుకుని ఓ మహిళా కండక్టర్ టికెట్లు జారీ చేస్తోంది. పసికందు ఆలనా పాలనా చూస్తూనే ఆమె విధులు నిర్వర్తిస్తున్న తీరు అమోఘం.. అదే సమయంలో ఆమె పడుతున్న ఇబ్బంది బాధాకరం. ఆర్టీసీ ఉన్నతాధికారులకు చేరేంత వరకు ఈ ఫొటోను షేర్ చేయండి’’ అంటూ ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమంలో ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై ‘సాక్షి’ లోతుగా పరిశీలిస్తే.. ఓ మహిళ పడుతున్న ఆవేదన మనసున్న ప్రతి మనిషిని కదిలించేలా ఉంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన అలియా జహాన్ 2012లో మతాంతర వివాహం చేసుకుంది. భర్త రవీందర్ పెద్దశంకరంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మతాంతర వివాహం కావడంతో ఇరువైపులా పెద్దలెవరూ వీరిని అక్కున చేర్చుకోలేదు. అలియా ఆర్టీసీలో కాంట్రాక్టు కండక్టర్‌గా సంగారెడ్డి డిపోలో పనిచేస్తోంది. 2013లో బాబు పుట్టడంతో 6 నెలలు ప్రసూతి సెలవులో వెళ్లింది. అదే సమయంలో తనతో పనిచేసే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యాయి. మరోమారు బిడ్డ పుట్టడంతో ప్రసూతీ సెలవుపై వెళ్లింది. ఆ సమయంలో 2015–16 మధ్య కాలంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారి సర్వీసును రెగ్యులరైజ్ చేశారు. ప్రసూతి సెలవులో ఉండడంతో మరోసారి క్రమబద్ధీకరణ అవకాశాన్ని కోల్పోయింది. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందనే ఆశతో అటు ఉద్యోగాన్ని వదులుకోలేక, ఇటు బిడ్డను చూసుకునే వారు లేక నానా ఇబ్బందులు పడుతోంది. నారాయణఖేడ్– హైదరాబాద్ మార్గంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసులో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటోంది. తనపై వార్తలు వస్తే అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తారేమోననే అలియా ఆందోళన వ్యక్తం చేసింది.