
బస్సు టైర్ పంక్చర్ అయి దాన్ని మార్చేందుకు డ్రైవర్ కష్టపడుతుండగా ఆయనకు మహిళా కండక్టర్‌తో పాటు విద్యార్థులు ఆసరా అయ్యారు. మహిళా కండక్టర్ పానా పట్టుకున్నపుడు ప్రయాణికులు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అందరూ ఆమెను అభినందించారు. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ భారతి రోజులాగే బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లింది.
రాజంపేట మండలం ఆరేపల్లి, తలమడ్ల గ్రామాల నుంచి విద్యార్థులు, ప్రయాణికులను తీసుకుని వస్తుండగా, పొందుర్తి శివారులో బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో డ్రైవర్ టైరు ఇప్పేందుకు ప్రయత్నించగా, కండక్టర్ భారతి కూడా ఆయనకు సహకరించింది. దీంతో టైరు మార్చి బస్సును ముందుకు తీసుకువెళ్లారు. కాగా భారతి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
–సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment