కన్యాదానం చేసి.. కన్నుమూశాడు
భిక్కనూరు : ‘బాల్‌చంద్రం.. అప్పుడే బాధ్యత తీరిందా..?’ కుటుంబాన్ని మించిన బాధ్యత లేదని, ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించావు. బిడ్డల ఉద్యోగాలు, పెళ్లిళ్లపై ఎన్నో కలలు కన్నావు. పెద్దబిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టిన కొద్ది సేపట్లోనే కన్నుమూశావు. నిన్నే నమ్మకున్న భార్య, నీ మార్గదర్శనంలో పెరిగిన మరో బిడ్డ పరిస్థితి ఏమిటి? వారికి దిక్కెవరు? అంటూ ఆ పెళ్లికి వచ్చిన వారు పచ్చని పందిరిలో రోదించిన తీరు కలిచివేసింది. కన్యాదా నం చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు ఆ తండ్రి. ఈ హృదయవిదారక ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కూతుళ్లు కనకమహాలక్ష్మి, కళ్యాణలక్ష్మి ఉన్నారు. పిల్లలిద్దరూ పీజీ పూర్తి చేసి గ్రూప్–1 మెయిన్స్ రాశారు. శుక్రవా రం భిక్కనూరు బీటీఎస్ చౌరస్తాలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో బాల్‌చంద్రం పెద్ద కూతురి పెళ్లి జరిగింది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన కొద్ది సేపటికి బంధుమిత్రులతో ముచ్చటిస్తూ బాల్‌చంద్రం కుప్పకులా డు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని కామారెడ్డిలోని హౌసింగ్‌బోర్డులో ఉన్న ఇంటికి చేర్చారు. పెళ్లికి వచ్చిన అతిథులే అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన కూతురు తండ్రి మరణంతో కన్నీరుమున్నీరైంది. భార్యతోపాటు రెండో కూతురు తమకు దిక్కెవరంటూ రోదించసాగారు.
పెళ్లి మండపంలో
వధువు తండ్రికి గుండెపోటు
ఆస్పత్రికి తరలింపు..
పరిస్థితి విషమించి మృతి
పెళ్లింట తీవ్ర విషాదం
Comments
Please login to add a commentAdd a comment