జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు
● ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం
● అందుబాటులో
బ్యాలెట్ పేపర్లు, బాక్సులు
● వీడియోకాన్ఫరెన్స్‌లో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ జారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, వెబ్ కాస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై కలెక్టర్‌తో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామని, పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకోసారి రిపోర్ట్ అందించేలా వ్యవస్థను సిద్ధం చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment