బుగ్గకు వెళ్లేదారిలో బాధలెన్నో..!
మద్దికుంటకు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు
రామారెడ్డి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మద్దికుంట బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తనున్నారు. రామారెడ్డి – ఇసన్నపల్లి మీదుగా మద్దికుంట వరకు, మద్దికుంట మర్రి నుంచి మద్దికుంట గ్రామం వరకు ఉన్న రోడ్లు అధ్వానంగా మారాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 26న భక్తులు ఈ ఆలయానికి పోటెత్తనున్నారు. ఆ రోజున స్వామివారిని లక్ష మంది వరకు దర్శించుకుంటారు. అయినప్పటికీ ఎవరు కూడా రోడ్లను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇస్సన్నపల్లి నుంచి మద్దికుంట వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. గతంలో శివరాత్రి వేళ బుగ్గ దైవదర్శనానికి వచ్చిన భక్తులు ఇసన్నపల్లి దగ్గర కారు బోల్తా పడి ప్రమాదానికి గురయ్యారు. గత అనుభవాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
అధ్వానంగా మద్దికుంట
రామలింగేశ్వర ఆలయ రోడ్డు
అడుగడుగునా గుంతలు
శివరాత్రి వేళ పోటెత్తనున్న భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment