తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి క్రైం: వేసవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో తన చాంబర్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీల సిబ్బంది నీటి వనరులకు సంబంధించిన ఏవైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలను గుర్తించాలని, లికేజీలను అరికట్టేందుకు ప్రతి మండలంలో తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. మండల అధికారులు, మిషన్ భగీరథ ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4007కు తెలపాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నీటి వృథాను అరికట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మిషన్ భగీ రథ నిజామాబాద్ సర్కిల్ ఎస్‌ఈ రాజేంద్ర కుమా ర్, బాన్సువాడ, ఆర్మూర్ మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ లు స్వప్న, నరేశ్, కామారెడ్డి ఇంట్రా ఈఈ రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment