జాగ్రత్తలు తీసుకోవాలి..
దోమకొండ: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని సంగమేశ్వర్ గ్రా మపంచాయతీ పరిధిలో ఉన్న సేంద్రియ ఎరువుల కేంద్రాన్ని, మండల కేంద్రంలోని కొనసాగుతున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి నీటిని పోశారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కర్మాగారం యూనిట్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం కార్యదర్శులతో మాట్లాడారు. ఈనెలాఖరు నాటి కి వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్‌పీవో శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, తహసీల్దార్ సంజయ్‌రావ్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment