నేపాల్ టూరిస్టుల బస్సు బోల్తా
భాకరాపేట, న్యూస్‌లైన్: పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వచ్చిన నేపాల్ దేశస్తుల బస్సు టైర్ పంక్చర్ కావడంతో సోమవారం భాకరాపేట ఘాట్‌లో బోల్తాపడింది. దీంతో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు ఇలా.. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌కు చెందిన 50 వుంది భారతదేశంలోని దేవాలయూల సందర్శనకు జనవరి 25న బయులు దేరారు. జనవరి 27న బీహార్ రాష్ట్రం చేరుకున్నారు. అక్కడ న్యూ చండేశ్వరి ట్రావెల్స్ నుంచి ఎన్4కే 4733 బస్సులో దేవాల యూల సందర్శనకు బయులుదేరారు. గయూ, జార్ఖండ్ బాబూరామ్, కోల్కత్తా, గంగానగర్, జగన్నాథపూరీ, బెంగళూరు సందర్శించారు.
అనంతరం సోమవారం మధ్యాహ్నం తిరువుల వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళుతుండగా భాకరాపేట ఘాట్ రోడ్డులో టూరిస్టు బస్సు టైరు పంక్చర్ అరుు బోల్తా పడింది. ప్రవూదంలో 8 వుంది స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే భాకరాపేట పోలీసులు, రంగంపేట డీఆర్వో, అటవీ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. టూరిస్టులను ముళ్లపొదల్లోంచి బయటకు తీసుకొచ్చారు. గాయపడ్డవారికి భాకరాపేట, పీలేరు 108 సిబ్బంది చికిత్సలు చేశారు. సంఘటన స్థలాన్ని పీలేరు సీఐ నరసింహులు, చంద్రగిరి సీఐ వుల్లికార్జునగుప్తా, భాకరాపేట ఎస్ఐ నెట్టికంఠయ్యు, ఎర్రావారిపాళెం ఎస్ఐ ఎస్కే.రహీవుుల్లా, రంగంపేట డీఆర్వో బాలాజీ పరిశీలించారు.
వెంకటేశ్వరుడే కాపాడాడు
తిరువుల వెంకటేశ్వరుడిని తవు ఇంటి దైవంగా పూజిస్తామని, ఆయనే తమను కాపాడాడని గైడ్ సురక్షతగౌతమ్ తెలిపారు. 45 రోజుల యూత్రకు భారతదేశం వచ్చామని, తిరువులేశుని దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరో పది అడుగులు ముందుకు పోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపారు. తాము వేంకటేశ్వరుని దర్శించుకున్నాకే తమ దేశం వెళతామని చెప్పారు.